Representative Image (Photo Credits: IANS)

Congo, FEB 05: మధ్య ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (Congo Rebels) తిరుగుబాటుదారులు చెలరేగిపోయారు. జైలులోని వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. మరి కొన్ని గదుల్లో ఉన్న వారిని సజీవ దహనం చేశారు. (women raped, burnt alive) మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. గత వారం రువాండా మద్దతు ఉన్న ఎం23 తిరుగుబాటు గ్రూపులు కాంగో నగరంలోకి ప్రవేశించాయి. జనవరి 27న గోమాలోకి చొరబడ్డారు. తిరుగుబాటుదారులు ముంజెంజ్ జైలుపై దాడి చేశారు. తమ వర్గం వారిని విడిపించారు.

US Illegal Indian Immigrants Return: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ఇండియాకు పంపిన ట్రంప్, 104 మందితో అమృత్‌సర్ చేరుకున్న విమానం 

కాగా, ఈ సందర్భంగా ఆ జైలులోని మగ ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. అయితే మహిళా ఖైదీలపై తిరుగుబాటుదారులు అత్యాచారాలకు పాల్పడ్డారు. వారిని బంధించిన కొన్ని గదులకు నిప్పంటించారు. దీంతో వందలాది మహిళా ఖైదీలు సజీవ దహనమయ్యారు.

Pakistan: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు.. 30 మంది మృతి! 

మరోవైపు ఈ సంఘర్షణలో సామూహిక అత్యాచారాలు, లైంగిక హింస, దారుణ మరణశిక్షలు, నిరాశ్రయ శిబిరాలపై బాంబు దాడులు వంటి మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి (ఐరాస) హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. తిరుగుబాటుదారుల ఆంక్షల కారణంగా ఐరాస శాంతి పరిరక్షకులు ఆ జైలులోకి ప్రవేశించలేకపోయినట్లు పేర్కొంది.