Ban on Imran Khan Speechs: ఇమ్రాన్‌పై నిషేదం విధించిన టీవీ ఛానెళ్లు, ఇకపై ఇమ్రాన్ మాట్లాడితే లైవ్ ఇవ్వకూడదని మూకుమ్మడి నిర్ణయం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నిషేదిస్తున్నట్లు ప్రకటన, ఇంతకీ ఇమ్రాన్ ఏమన్నాడో తెలుసా?
తాజాగా, ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు, మహిళా న్యాయమూర్తిని హెచ్చరించారు.
Islamabad, AUG 21: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan's speech) ప్రసంగాలను ఇకపై లైవ్‌లో ప్రసారం చేయకూడదని ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ (Pakistan Electronic Media Regulatory Authority) నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు, మహిళా న్యాయమూర్తిని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాక్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ (Pakistan Electronic Media Regulatory Authority) ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇమ్రాన్ ఖాన్ కు (Imran Khan) సంబంధించిన ప్రసంగాలను రికార్డు చేసి, ఎడిట్ చేసిన అనంతరమే ప్రసారం చేయాలని చెప్పింది. అన్ని శాటిలైట్ ఛానెళ్ళు (satellite channels) తమ ఆదేశాలను పాటించాలని తెలిపింది.
తమ దేశ చట్టంలోని అధికారాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. తమ పార్టీ నేత షెహ్ బాజ్ గిల్ ను పోలీసులు వేధించారని, ఇస్లామాబాద్ ఇన్స్ పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్, మహిళా న్యాయమూర్తిపై కేసులు నమోదు చేయాలని తాజాగా ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అలాగే, దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.
తాము ఐటీ, డీఐజీని వదలబోమని హెచ్చరించారు. ఒకవేళ గిల్ కు వ్యతిరేకంగా కేసులు నమోదు చేస్తే, ఐటీ, డీఐజీ, మహిళా న్యాయమూర్తిపై కూడా నమోదు చేయాలని అన్నారు. గిల్ ను వేధింపులకు గురిచేస్తూ తమను భయపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రసంగాలను లైవ్ లో ప్రసారం చేయవద్దని ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంది.