Tanzania Plane Crash: టాంజానియాలో ఘోర విమాన ప్రమాదం, చెరువులో కుప్పకూలిన ప్లైట్, 19 మంది మృతి, ప్రమాద సమయంలో విమానంలో 40 మంది ప్రయాణికులు, వీడియో ఇదుగోండి!

40 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం స్థానిక చెరువులో కూలిపోయింది. ఈ ఘటన టాంజానియాలోని బుకోబా ఎయిర్‌పోర్టు వద్ద ఆదివారం ఉదయం జరిగింది. ప్రెసిసన్ ఎయిర్ సంస్థకు(Precision Air flight) చెందిన దేశీయ విమానం దార్ ఎస్ సలామ్ అనే పట్టణం నుంచి 40 మంది ప్రయాణికులతో బయల్దేరింది.

Screen Garb from Twitter Video

Dar es Salaam, NOV06: టాంజానియాలో (Tanzania) విమాన ప్రమాదం (plane crash) చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం స్థానిక చెరువులో కూలిపోయింది. ఈ ఘటన టాంజానియాలోని బుకోబా ఎయిర్‌పోర్టు వద్ద ఆదివారం ఉదయం జరిగింది. ప్రెసిసన్ ఎయిర్ సంస్థకు(Precision Air flight) చెందిన దేశీయ విమానం దార్ ఎస్ సలామ్ అనే పట్టణం నుంచి 40 మంది ప్రయాణికులతో బయల్దేరింది. అయితే, బుకోబా ఎయిర్‌పోర్టు వద్ద ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో 100 మీటర్ల ఎత్తులో ఉండగా, వాతావరణం సరిగ్గా లేకపోవడంతో కుదుపునకు గురైంది. ఈ సమయంలో వర్షం పడుతుండటం, వేగంగా గాలి వీయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.

దీంతో విమానం దగ్గర్లోని విక్టోరియా లేక్‌లో (Lake Victoria) కూలిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. విమానంలోని ప్రయాణికుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రయాణికుల్లో చాలా మందిని భద్రతా సిబ్బంది రక్షించారు. మిగతావారిని కూడా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనలో విమానంలో చాలా లోతు నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif