Afghanistan Crisis: తాలిబన్లకు దిమ్మతిరిగే షాక్, మూడు జిల్లాలను తిరిగి స్వాధీనం చేసుకున్న రెబల్ ఫోర్స్, పోరాటంలో 40 మంది తాలిబన్లు మృతి, పలువురికి గాయాలు
తాజాగా వారికి షాక్ ఇచ్చారు. వారి ఆధీనంలో ఉన్న మూడు జిల్లాలను రెబల్ ఫోర్స్ తిరిగి స్వాధీనం (Resistance Forces Recapture 3 Districts) చేసుకుంది.
Kabul, August 21: ఆఫ్ఘనిస్తాన్‌పై తాలిబాన్ నియంత్రణను తీవ్రతరం చేయడానికి రెబల్ ఫైటర్స్ ప్రయత్నిస్తుండగా.. తాజాగా షాక్ ఇచ్చారు. వారి ఆధీనంలో ఉన్న మూడు జిల్లాలను రెబల్ ఫోర్స్ తిరిగి స్వాధీనం (Resistance Forces Recapture 3 Districts) చేసుకుంది. ఖైర్ ముహమ్మద్ అందరాబి నేతృత్వంలోని ప్రజా ప్రతిఘటన దళాలు బాగ్లాన్ ప్రావిన్స్‌లోని పాల్-ఇ-హేసర్, దేహ్ సలాహ్, బాను జిల్లాలను స్వాధీనం చేసుకున్నాయని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఈ పోరాటంలో సుమారు 40 మంది తాలిబన్ ఫైటర్స్ మరణించగా (Many Insurgents Killed), మరో 15 మంది గాయపడినట్లు పేర్కొన్నాయి. కాగా ప్రతిఘటన దళాలు ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా చేరుకున్నాయని సమాచారం.
ప్రతిఘటన దళాలు (Anti-Taliban forces) మరియు తాలిబాన్ల మధ్య ఘర్షణల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యుకె ఆధారిత పర్షియన్ టీవీ స్టేషన్ ఇరాన్ ఇంటర్నేషనల్ సీనియర్ కరస్పాండెంట్, తాజుడెన్ సోరౌష్ ఒక ట్వీట్‌లో ఇలా అన్నారు, "బాగ్లాన్ ప్రావిన్స్‌లోని స్థానిక నిరోధక దళాలు తాలిబాన్ నుండి బాను మరియు పోల్-ఎ-హేసర్ జిల్లాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు మాజీ, ఆఫ్ఘ్ ప్రభుత్వ అధికారులు నాకు చెప్పారు. వారు దేహ్ సలాహ్ జిల్లా వైపు ముందుకు సాగుతున్నారు. దాదాపు 60 మంది తాలిబాన్ సైనికులు మరణించారు లేదా గాయపడ్డారు. మరొక ట్వీట్‌లో, "డి సలాహ్ జిల్లా కూడా స్థానిక నిరోధక దళాలకు పడిపోయిందిని తెలిపారు.
కాగా, తాలిబన్లు (Taliban) ప్రకటించిన మేరకు సాధారణ క్షమాభిక్ష స్ఫూర్తితో వారు పని చేయలేదని ప్రజా ప్రతిఘటన దళాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లను ఎదుర్కొంటామని, మిగతా జిల్లాలను కూడా స్వాధీనం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాయి. కాగా, రెబల్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్న జిల్లాల్లో తిరిగి ఆఫ్ఘన్ జెండాలను పునరుద్ధరించారు. తాలిబన్ల వశం కాని పంజ్‌షీర్ ప్రావిన్స్‌కు సమీపంలో మూడు జిల్లాలను రెబల్ ఫోర్సెస్ స్వాధీనం చేసుకున్నాయి. తాలిబన్ చేతిలో మరణించిన వ్యతిరేక నాయకుడు అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్ ఈ ప్రతిఘటన దళాలకు కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.
Here's Updates
మరోవైపు తాలిబన్లపై ప్రతిఘటన సజీవంగా ఉన్నదని, ఆఫ్ఘనిస్థాన్ మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా ముహమ్మది తెలిపారు. తాలిబన్ల ఆధీనంలోని మూడు జిల్లాలను ప్రతిఘటన దళాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. తాలిబన్ ఉగ్రవాదులను ఎదుర్కోవడం తమ విధి అన్ని ట్వీట్ చేశారు.