Government officials welcome Indian nationals on their arrival from crisis-hit Kabul (PTI)

Kabul, August 21: కాబూల్ నుంచి భారత వాయుసేన సి-130 జే విమానం 85 మంది భారతీయులతో శనివారం బయలుదేరింది. అఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో కాబూల్ నగరంలో ఉన్న 85 మంది భారత పౌరులను అధికారులు వాయుసేన విమానంలో(3rd evacuation flight takes off) తీసుకువస్తున్నారు. కాబూల్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఇంధనం నింపుకోవడానికి తజికిస్థాన్‌లో ల్యాండ్ అయింది. కందహార్ నుంచి భారతపౌరులను తిరిగి తీసుకువచ్చారు.

కందహార్ నుంచి భారత రాయబార కార్యాలయ సిబ్బంది కాబూల్ వచ్చి అక్కడి వారిని స్వదేశానికి తీసుకువస్తున్నారు.తాలిబాన్ల క్రూరమైన పాలన,ప్రతీకార హత్యల ముప్పు గురించి ప్రజలు భయపడుతున్నందున అఫ్ఘాన్ రాజధానిలో ప్రజలకు భయం పట్టుకుంది. భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో భారత అధికారులు సహాయం చేశారు. ఇక వాయుసేనకు చెందిన మరో సి-17 విమానం కూడా కాబుల్‌ ఎయిర్‌పోర్టులో ఉంది. భారతీయులను తీసుకుని ( 85 Indians on board) ఆ విమానం కూడా త్వరలోనే స్వదేశానికి బయల్దేరనున్నట్లు తెలుస్తోంది.

బయటకొస్తున్న తాలిబన్ల అసలు రూపం, భారత్‌తో సహా పలు దేశాల పౌరులు కిడ్నాప్, కాబూల్‌లోని ఖ‌ర్జాయ్ విమానాశ్ర‌యం వ‌ద్ద కిడ్నాప్ కలకలం, 150 మంది కిడ్నాప్ వార్తల‌ను ఖండించిన తాలిబ‌న్ ప్ర‌తినిధి

ఇటీవల అఫ్గాన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలించిన విషయం తెలిసిందే. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తర్వాత ఆ దేశ గగనతలాన్ని మూసివేశారు. దీంతో భారతీయుల తరలింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. అయితే ఆ తర్వాత అమెరికా దళాల సహకారంతో భారత్‌ ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపునకు ఏర్పాట్లు చేసింది.

ఈ పరిస్థితుల ఇలా ఉంటే తాలిబ‌న్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ముల్లా అబ్దుల్ ఘ‌నీ బ‌రాదార్ ( Mullah Abdul Ghani Baradar ) శ‌నివారం కాబూల్ చేరుకున్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటు గురించి ఆయ‌న కీల‌క స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. జిహాదీ నేత‌లు, రాజ‌కీయ‌వేత్త‌ల‌తో బ‌రాదార్ ప్ర‌భుత్వ ఏర్పాటుపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. గ‌త ఆదివారం తాలిబ‌న్లు కాబూల్‌ను వ‌శ‌ప‌రుచుకున్న విష‌యం తెలిసిందే. అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ దేశం విడిచి పార‌పోయిన నేప‌థ్యంలో ఇప్పుడు ఆఫ్ఘ‌నిస్తాన్ తాలిబ‌న్ల రాజ్యంగా మారింది. అయితే ప్ర‌భుత్వ ఏర్పాటు అక్క‌డ కీల‌కంకానున్న‌ది.

తాలిబ‌న్ నేత బ‌రాదార్‌ను 2010లో పాకిస్థాన్‌లో అరెస్టు చేశారు. అమెరికా వ‌త్తిడి వ‌ల్ల ఆయ‌న్ను 2018 వ‌ర‌కు క‌స్ట‌డీలో ఉంచారు. ఆ త‌ర్వాత ఆయ‌న్ను ఖ‌తార్‌కు త‌ర‌లించారు. దోహాలో ఉన్న తాలిబ‌న్ పొలిటిక‌ల్ ఆఫీసుకు అధిప‌తిగా అత‌న్ని నియ‌మించారు. ఆఫ్ఘ‌న్ నుంచి అమెరికన్ ద‌ళాలు వెన‌క్కి వెళ్ల‌డానికి కీల‌క‌మైన స‌మావేశాల‌ను ఆయ‌నే నిర్వహించారు. దోహాలో జ‌రిగిన శాంతి ఒప్పందాల్లో పాల్గొన్నారు. నిజానికి ఖ‌తార్ నుంచి మూడు రోజుల క్రిత‌మే బ‌రాదార్ తాలిబ‌న్ల‌కు కేంద్ర‌మైన కాంద‌హార్ చేరుకున్నాడు.

ఇక ఆఫ్ఘ‌నిస్తాన్ మాజీ అధ్య‌క్షుడు అష్రాఫ్ ఘ‌నీ సోద‌రుడు హ‌స్మ‌త్ ఘ‌నీ అహ్మ‌ద్‌జాయి ( Hashmat Ghani )తాలిబ‌న్ల‌తో చేతులు క‌లిపారు. తాలిబ‌న్ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న‌ట్లు హ‌స్మ‌త్ ప్ర‌క‌టించిన‌ట్లు ఓ క‌థ‌నం వ‌చ్చింది. తాలిబ‌న్ల దురాక్ర‌మ‌ణ‌తో మాజీ అధ్య‌క్షుడు అష్రాఫ్ ఘ‌నీ దేశం విడిచి వెళ్లిన విష‌యం తెలిసిందే. ర‌క్త‌పాతం సృష్టించ‌వ‌ద్దు అన్న ఉద్దేశంతో దేశం విడిచి పారిపోయిన‌ట్లు అష్రాఫ్ ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. అయితే తాలిబ‌న్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు అష్రాఫ్ ఘ‌నీ సోద‌రుడు హ‌స్మ‌త్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. తాలిబ‌న్ నేత ఖ‌లీల్ ఉర్ రెహ్మాన్‌, మ‌త‌పెద్ద ముఫ్తీ మ‌హ‌మూద్ జాకిర్‌ల స‌మ‌క్షంలో హ‌స్మ‌త్ వారితో చేతులు క‌లిపారు.