Children Covid Vaccination:చిన్నారుల కోవిడ్ వ్యాక్సినేషన్‌కు స్విట్జర్లాండ్‌ గ్రీన్ సిగ్నల్, 5 నుంచి 11 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ షురూ, కరోనా ఐదో వేవ్‌తో స్విస్ సర్కారు నిర్ణయం

ఐదు నుంచి 11 ఏండ్లలోపు చిన్నారులకు (Aged Between 5 And 11) కరోనా వ్యాక్సినేషన్‌ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ (Pfizer-Biontech's) తయారుచేసిన కమిర్నాటీ వ్యాక్సిన్‌ (Comirnaty vaccine)ను చిన్నారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

COVID-19 vaccine | Representational Image (Photo Credits: IANS)

Geneva December 11: కరోనా(Corona virus) విజృంభణను అరికట్టేందుకు స్విట్జర్లాండ్ (Switzerland) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు(Children) కూడా కరోనా వ్యాక్సినేషన్ (Covid Vaccination) ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదు నుంచి 11 ఏండ్లలోపు చిన్నారులకు (Aged Between 5 And 11) కరోనా వ్యాక్సినేషన్‌ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ (Pfizer-Biontech's) తయారుచేసిన కమిర్నాటీ వ్యాక్సిన్‌ (Comirnaty vaccine)ను చిన్నారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికి స్విట్జర్లాండ్‌(Switzerland) మెడిసిన్స్‌ ఏజెన్సీ స్విస్‌మెడిక్‌ (Swiss medic) ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏజ్‌ గ్రూప్‌ వారికి వ్యాక్సిన్లు ఇస్తున్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్‌ కూడా చేరినట్లయింది. ఇప్పటికే పోర్చుగల్‌ (Portugal), ఇటలీ (Italy), గ్రీస్‌ (Greece), స్పెయిన్‌ (Spain), కెనడా (Canada), అమెరికా (United States) దేశాలు ఈ ఏజ్‌ గ్రూప్‌ చిన్నారుల్లో వ్యాక్సినేషన్‌కు అనుమతించాయి.

Omicron Covid Variant: ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు, మళ్లీ మాస్కులు ధరించాలని సూచన

క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా ఐదు నుంచి 11 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన చిన్నారులకు వ్యాక్సిన్‌ సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు స్విస్‌మెడిసిస్‌ తెలిపింది. దీంతో చిన్నారులకు మూడు వారాల వ్యవధిలో కమిర్నాటి వ్యాక్సిన్‌ (Comirnaty vaccine) ను రెండు డోసులను పంపిణీ చేస్తామని చెప్పింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పెద్దవారిలో కంటే తక్కువగా సైడ్‌ ఎఫెక్టులు ఉంటాయిని తెలిపింది. వాటిలో టీకా ఇచ్చిన ప్రాంతంలో నొప్పి, అలసట, తలనొప్పి, జ్వరం వంటివి ఉంటాయని స్పష్టం చేసింది. స్విట్జర్లాండ్‌లో ప్రస్తుతం 12 ఏండ్ల పైబడినవారికి వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తున్నారు. అటు అక్కడ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే స్విట్జర్లాండ్ లో కరోనా ఐదో వేవ్‌ (Fifth Wave) కొనసాగుతున్నది.