Usha Chilukuri Set To Become Second Lady of US: అమెరికా రెండో మహిళగా తెలుగింటి ఆడపడుచు, వాన్స్ తో ఉషాచిలుకూరి ప్రేమ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ (Usha Vance) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.
Washington, NOV 06: అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో (America Election ) రిపబ్లికన్లు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా తెలుగింటికి చెందిన అల్లుడు జేడీ వాన్స్ (JD Vance ) అమెరికాకు ఉపాధ్యక్షుడిగా (Vice President) ఎన్నికకానున్నారు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ (Usha Vance) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1980లో అమెరికాకు వలస వెళ్లారు. వీరి ముగ్గురు సంతానంలో ఉషా ఒకరు. జేడీ వాన్స్ ఒహాయో రాష్ట్ర సెనేటర్‌గా, అమెరికా ఉపాధ్య అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక చేసుకుని ఎన్నికల్లో పోటీ చేశారు.
చదువుకునే రోజుల్లోనే స్కూల్‌లో ఉషాకు పరిచయమైన వాన్స్ ఒకరినొకరు ప్రేమించుకుని 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం కెంటకీలో వివాహం చేసుకున్నారు. ఉషా యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు.