Deadly COVID-19: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు అమెరికా షాక్, కరోనా అలర్ట్‌లో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని నిధులు నిలిపివేత, నిర్ణయం మంచిది కాదన్న బిల్‌గేట్స్,చైనా

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కు అమెరికా అందిస్తున్న నిధులు నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (United States President Donald Trump) శ్వేతసౌధం సాక్షిగా తెలిపారు. కరోనా వైరస్‌(COVID-19) సంక్షోభం గురించి అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్య‌క్షుడు తీసుకున్న నిర్ణ‌యం మంచిది కాద‌ని మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్‌గేట్స్ (Bill Gates) బుధ‌వారం అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ఇలాంటి నిర్ణ‌యాలు స‌హేతుకం కాద‌ని పేర్కొన్నారు.

US President Donald Trump (Photo Credits: IANS)

Washington, April 15: ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కు అమెరికా అందిస్తున్న నిధులు నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (United States President Donald Trump) శ్వేతసౌధం సాక్షిగా తెలిపారు. కరోనా వైరస్‌(COVID-19) సంక్షోభం గురించి అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్య‌క్షుడు తీసుకున్న నిర్ణ‌యం మంచిది కాద‌ని మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్‌గేట్స్ (Bill Gates) బుధ‌వారం అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ఇలాంటి నిర్ణ‌యాలు స‌హేతుకం కాద‌ని పేర్కొన్నారు.

క‌రోనా వ్యాధి నియంత్ర‌ణ‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని, ఈ సంస్థ అవ‌స‌రం ప్ర‌పంచానికి ఎంతైనా ఉంద‌ని అన్నారు. జ‌న‌వ‌రి చివ‌ర్లో క‌రోనా వైర‌స్‌ను ప‌బ్లిక్ ఎమ‌ర్జెన్సీగా డ‌బ్యూహెచ్‌వో ప్ర‌క‌టించిందనా గుర్తు చేశారు. కాగా బిల్‌, మెలిండా గేట్స్ ఫౌండేష‌న్ త‌ర‌పున 100 మిలియ‌న్ డాల‌ర్ల విరాళాన్ని బిల్‌గేట్స్ ప్ర‌క‌టించింది.

See Bill Gates' Tweet

ఇక అమెరికాలో క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ అమ‌లు చేయాలంటూ బిల్‌గేట్స్ స‌హా ప‌లువ‌రు నిష్ణాతులు కోరినా ట్రంప్ అవేమీ ప‌ట్టించుకోలేదు. ఫ‌లితం అమెరికాలో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తూ ప్ర‌జ‌ల‌ను అల్లాడిస్తుంది. ఇక డ‌బ్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యంపై అమెరిక‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ స్పందించింది. ప్ర‌పంచం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొం టున్న ఈ స‌మ‌యంలో ట్రంప్ నిర్ణ‌యం ప్ర‌మాద‌ర‌క‌ర‌మైనందంటూ అభిప్రాయ‌ప‌డింది. ఈ మేర‌కు డాక్ట‌ర్ ప్యాట్రిస్ హారిస్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ట్రంప్ త‌న నిర్ణ‌యాన్ని మ‌రోసారి స‌మీక్షించాలంటూ పేర్కొన్నారు.

Watch Trump's Statement on WHO

ఇక అమెరికా డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేసేందుకు ఇది సరైన సమయం కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం పరస్పర సంఘీభావంతో మెలుగుతూ ఐకమత్యంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం ఇంతవరకు ఈ విషయంపై స్పందించలేదు.

Here's  Reuters Tweet

ట్రంప్ చేసిన ప్రకటనపై చైనా స్పందించింది. కరోనా వైరస్‌(కోవిడ్‌-19) సంక్షోభ సమయంలో అగ్రరాజ్యం నిర్ణయం ఆందోళనకరంగా పరిణమించిందని పేర్కొంది. మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో అమెరికా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చైనా అధికారి జావో లిజియన్‌ మాట్లాడుతూ.. ‘‘ అమెరికా నిర్ణయం ప్రపంచ ఆరోగ్య సంస్థ సామర్థ్యాలను బలహీనపరిచేలా ఉంది. మహమ్మారిపై పోరులో అంతర్జాతీయంగా పరస్పర సహకారం అందించుకొనే అంశానికి విఘాతం కలిగించేలా ఉంది’’అని పేర్కొన్నారు.

కాగా ఏడాదికి 400 నుంచి 500 మిలియన్‌ డాలర్ల చొప్పున అమెరికా డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు సమకూరుస్తోందని... కాబట్టి సంస్థ వ్యవహారశైలిపై ప్రశ్నించడం తమ కర్తవ్యంలో భాగమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కేవలం 40 మిలియన్‌ డాలర్లు లేదా అంతకన్నా తక్కువ నిధులు ఇస్తున్న చైనాకు డబ్ల్యూహెచ్‌ఓ వత్తాసు పలికి.. కరోనా గురించి నిజాలను దాచిందని ఆరోపణలు గుప్పించారు.

కాగా చైనాలోని వుహాన్‌ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్‌ క్రమంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహమ్మారి ధాటికి అక్కడ 25 వేలకు పైగా మరణాలు సంభవించగా... 6 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకీ కరోనా బాధితులు, మృతుల సంఖ్య పెరుగతుండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని ట్రంప్‌ ఆరోపిస్తూ.. ఇందుకు ప్రతిగా నిధులు నిలిపివేస్తామని కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్నారు.

తాజాగా తన నిర్ణయాన్ని అమలు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసి గట్టిషాకిచ్చారు. దీంతో ఆర్థికపరంగా సంస్థకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ఇక ట్రంప్‌ హెచ్చరికలపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ మహమ్మారిని అరికట్టేందుకు అమెరికా, చైనా సహా ఇతర దేశాలు కలిసికట్టుగా పోరాడాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now