UK PM Boris Johnson Wedding: ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని, క్యారీ సైమండ్స్‌ని రహస్యంగా వివాహమాడిన బోరిస్ జాన్సన్
లండన్‌లో వెస్ట్‌మినిస్టర్ క్యాథెడ్రల్లో ప్రియురాలు క్యారీ సైమండ్స్‌తో శనివారం బోరిస్ రహస్య వివాహం (UK Prime Minister Boris Johnson Marries Fiancee Carrie Symonds) జరిగినట్లు తెలుస్తోంది.
London, May 30: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు (UK PM Boris Johnson Wedding) అక్కడి పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. లండన్‌లో వెస్ట్‌మినిస్టర్ క్యాథెడ్రల్లో ప్రియురాలు క్యారీ సైమండ్స్‌తో శనివారం బోరిస్ రహస్య వివాహం (UK Prime Minister Boris Johnson Marries Fiancee Carrie Symonds) జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ది సన్, మెయిల్ ఆన్ సండేవర్క్ లాంటి టాబ్లాయిడ్లు ప్రముఖంగా ప్రచురించాయి. బోరిస్-సైమండ్స్ వివాహానికి సీనియర్ సభ్యులతో సహా ఎవరికీ ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది.
ఈ పెళ్లి విషయం ప్రధాని కార్యాలయంలో సీనియర్ అధికారులకు కూడా తెలియనీయలేదు. వీరి పెళ్లి జరిగిన కేథలిక్ కెథడ్రాల్‌ని మధ్యాహ్నం 1.30 సమయంలో మూసివేశారు. ఒక అర్ధగంట తర్వాత 33 ఏళ్ల సైమోడ్స్ లిమోజిన్ వాహనంలో అక్కడకు వచ్చారు. ఆమె తెల్లటి గౌను ధరించి ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పెళ్లిళ్లకు కేవలం 30 మంది అతిథులుమాత్రమే ఉండాలనే నిబంధన అమల్లో ఉంది. ఈ అంశంపై బ్రిటన్ ప్రధాని అధికార నివాసమైన డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.
కేవలం కొద్దిమంది గెస్టుల మధ్య.. అది కూడా చివరి నిమిషంలో వాళ్లకు ఆహ్వానం ఇచ్చినట్లు ఆ పత్రికలు రాశాయి. బోరిస్ 2019లో ప్రధాని అయ్యాక డౌనింగ్ స్ట్రీట్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ సైమండ్స్(33)తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. పోయినేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు. అయితే వచ్చే ఏడాది జులైలో వీళ్ల పెళ్లి జరగొచ్చని కొన్ని పత్రికలు కథనాలు రాసినప్పటికీ.. ఇప్పుడు హడావుడిగా పెళ్లి జరిగిందని అదే పత్రికలు మరోసారి కథనాలు రాశాయి.
గతంలో బోరిస్(56) వివాహేతర సంబంధంతో కన్జర్వేటివ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. కాగా, బోరిస్ జాన్సన్‌కి ఇది మూడో వివాహం. గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. చివరిసారిగా మరీనా వీలర్ అనే లాయర్‌కి 2018లో విడాకులిచ్చారు.ఆయన రెండో భార్య మారినా వేలర్‌కు నలుగురు సంతానం. ఈమధ్యే బోరిస్‌కు సలహాదారుడిగా పని చేసిన డొమినిక్ కమింగ్స్.. ప్రధాని పదవికి బోరిస్ అనర్హుడంటూ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా, బ్రిటన్ ప్రధాని పదవిలో ఉండి లార్డ్ లివర్‌పూల్ 1822లో పెళ్లి చేసుకున్నాడు.