Ukraine-Russia War: ఉక్రెయిన్‌ని శవాల దిబ్బగా మార్చేదాకా నిద్రపోని రష్యా, తాజాగా నీట మునిగిన ఉక్రెయిన్‌ సిటీపై బాంబుల వర్షం, డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో ప్రమాదకరంగా పరిస్థితి

ఇక్కడ ఉక్రెయిన్‌, రష్యా దళాలు అమర్చిన ట్యాంకు విధ్వంసక మందుపాతరలు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Ukraine Dam Burst

New Delhi, June 9: ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రభావిత దక్షిణ ఖేర్సన్‌ వద్ద కఖోవ్కా డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉక్రెయిన్‌, రష్యా దళాలు అమర్చిన ట్యాంకు విధ్వంసక మందుపాతరలు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్న మందుపాతరలు అక్కడి ప్రజలకే కాదు.. సహాయక బృందాలకు కూడా ముప్పుగా మారాయని రెడ్‌క్రాస్‌ చెబుతోంది.

డ్యామ్ పేల్చివేత, వరద ముంపులో మునిగిపోయిన ఉక్రెయిన్ దేశ ప్రధాన నగరాలు, వీడియో ఇదిగో..

ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి బాంబులతో విరుచుకుపడింది. రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని కఖోవ్‌కా డ్యామ్‌ను పేల్చేయడంతో ఆ డ్యామ్‌ కింద ఉన్న నగరం నీట మునిగింది. ఇప్పుడు ఆ నగరమే లక్ష్యంగా రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దాంతో ఇప్పటికే జనాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన ఆ నగరం పూర్తిగా ధ్వంసమైపోతున్నది.డ్యామ్‌ను పేల్చిన వెంటనే వరదనీరు నగరంలో ప్రవేశించింది.

దాంతో ఆ నగర ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఉక్రెయిన్‌ సైన్యం కూడా జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అయినా 14 మంది వరదల్లో కొట్టుకుపోయారు. వేల మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. డ్యామ్‌లో నీరంతా పోవడంతో లక్షల మందికి తాగునీటి కటకట ఏర్పడింది.

ఉక్రెయిన్‌లో కీలక డ్యామ్‌ను పేల్చేసిన రష్యా, వరద ముంపులో 42 వేల మంది ప్రజలు, ఘటనను మాన‌వ‌హ‌న‌న ప‌ర్యావ‌ర‌ణ బాంబుగా అభివర్ణించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

రష్యా సేనలు కఖోవ్‌కా డ్యామ్‌ను మాత్రమేగాక ఆ డ్యామ్‌ కింద ఉన్న జలవిద్యుత్‌ డ్యామ్‌ను కూడా పేల్చేశాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌ స్కీ ఆరోపించారు. అంతేగాక రష్యా బలగాలు తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్‌కు చెందిన జపోరిఝ్ఝియా న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ పరిసర ప్రాంతాలపై కూడా దాడులను కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పారు.

నీటితో నిండిన నోవా కఖోవ్కా నగరంలో కొంతభాగం రష్యా అధీనంలో మరికొంత భాగం ఉక్రెయిన్‌ అధీనంలో ఉంది. తమ అధీన నగర ప్రాంతంలో ఐదుగురు చనిపోయారని రష్యా నియమిత మేయర్‌ వ్లాదిమిర్‌ గురువారం చెప్పారు. మరికొందరి జాడ గల్లంతైంది. స్థానికుల తరలింపు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. తాగునీరు కరువై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్, మొబైల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌ పూర్తిగా పోయిందని అధికారులు చెప్పారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పర్యటించి అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ‘రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతవాసులకు వరద నష్టపరిహారం చెల్లించాలి. ఆస్తులు, వ్యాపారాలు నష్టపోయిన వారికి సాయం అందించాలి’ అని తర్వాత ఆయన కార్యాలయం ఆన్‌లైన్‌లో ఒక డిమాండ్‌ పంపింది. ‘600 చదరపు కిలోమీటర్ల భూభాగం నీటమునిగింది. ఇక్కడ ఏకంగా 18 అడుగుల ఎత్తులో నీరు నిలిచింది. 14,000కుపైగా భవనాలు నీటమునిగాయి. 4,000కుపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు పంపాం’ అని రష్యా నియమిత ఆ ప్రాంత గవర్నర్‌ ఒలెక్సాండర్‌ ప్రొకుడిన్‌ చెప్పారు. నీపర్‌ నది తూర్పు పరివాహక ప్రాంతంలో మూడింట రెండొంతుల భూభాగం ర్రష్యా ఆక్రమణలో ఉంది.

క్రిమియా స్వాధీన ప్రక్రియపై తమపై ఉక్రెయిన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) రష్యా సూచించింది. ఆ ఆరోపణలకు ఎలాంటి చట్టబద్ధత లేదని, కనీసం ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలూ వారి వద్ద లేవని నెదర్లాండ్స్‌లో రష్యా రాయబారి ఐసీజేకు వెల్లడించారు. మరోవైపు, ఐసీజేలో విచారణ ప్రారంభం కాగానే రష్యా తన దుష్ప్రచారాన్ని ప్రారంభించిందని ఉక్రెయిన్‌ ప్రతినిధులు వాదించారు. ఈ కేసులో వాదనలు మరో వారంలో ముగియనుండగా.. తీర్పు వెలువడడానికి మరికొన్ని నెలలు పట్టనుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif