Gold Cube on New York Road: 186 కిలలో బంగారు ముద్దను న్యూయార్క్ నగర వీధుల్లో పడేశారు, ఎందుకు పడేశారో తెలిస్తే..షాకవుతారు!

దాని బరువు దాదాపు 186 కిలోలు ఉంటుంది. అయినప్పటికీ దాన్ని ఎవరూ తీసుకెళ్లలేదు. 88 కోట్ల రూపాయల విలువైన ఈ బంగారు క్యూబ్‌ (Gold Cube)ను ఎందుకు తయారు చేశారో తెలుసా?

New York Feb 04: న్యూయార్క్(New York) నగర నడి వీధుల్లో పెద్ద బంగారు ముద్ద పడి(Gold Cube) ఉంది. దాని బరువు దాదాపు 186 కిలోలు ఉంటుంది. అయినప్పటికీ దాన్ని ఎవరూ తీసుకెళ్లలేదు. 88 కోట్ల రూపాయల విలువైన ఈ బంగారు క్యూబ్‌ (Gold Cube)ను ఎందుకు తయారు చేశారో తెలుసా? తన బిజినెస్ ప్రమోషన్ కోసం. అసలు ఏంటి ఈ బంగారు క్యూబ్. దాని కథ తెలుసుకుందా! బంగారంతో తయారు చేసిన క్యూబ్‌ బ‌రువు 186 కిలోలు. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్‌తో (Pure gold) చేసిన క్యూబ్ ఆకారంలో ఉండే ఆ గోల్డ్ వ‌స్తువు విలువ 11.7 మిలియ‌న్ డాల‌ర్లు. అంటే మ‌న క‌రెన్సీలో సుమారుగా 88 కోట్ల రూపాయ‌లు అన్న‌మాట‌. దీన్ని జ‌ర్మ‌నీకి చెందిన ఓ ఆర్టిస్ట్ నిక్లాస్ కాస్టెల్లో (Niclas Castello)త‌యారు చేశాడు. దీన్ని త‌యారు చేయ‌డం వెనుక ఓ ఉద్దేశం ఉంది.

దీన్ని త‌యారు చేశాక‌.. తీసుకెళ్లి న్యూయార్క్ సిటీలో ఉన్న సెంట్ర‌ల్ పార్క్‌లో వ‌దిలేశాడు నిక్లాస్(Niclas Castello). సెంట్ర‌ల్ పార్క్‌లో ఉన్న గోల్డ్ క్యూబ్‌ను చూసి అక్క‌డికి వ‌చ్చిన ప‌ర్యాట‌కులు, స్థానికులు షాక్ అయ్యారు. అది సూర్యుడి కాంతికి మెరిసిపోతుండ‌టం చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. అస‌లు.. ఏంటిది.. ఎందుకు ఇంత‌లా మెరిసిపోతోంది అని అనుకొని దాన్ని ట‌చ్ చేస్తూ.. దానితో ఫోటోలు దిగుతూ కాసేపు ఎంజాయ్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Niclas Castello (@niclas.castello)

అయితే.. ఇదంతా నిక్లాస్ ప‌బ్లిక్ స్టంట్. నిక్లాస్ కాస్టెల్లో(Niclas Castello) త్వ‌ర‌లో స‌రికొత్త క్రిప్టోకాయిన్‌ను తీసుకురాబోతున్నాడు. అందుకే ఇలా గోల్డ్ క్యూబ్‌ను త‌యారు చేసి పబ్లిక్ ప్లేస్‌లో వ‌దిలేశాడు. కాస్టెల్లో కాయిన్‌ (Castello Coin) పేరుతో నిక్లాస్ క్రిప్టోకాయిన్‌ను లాంచ్ చేశాడు. త్వర‌లోనే ఎన్ఎఫ్‌టీని కూడా లాంచ్ చేయ‌నున్న‌ట్టు నిక్లాస్ వెల్ల‌డించాడు. ప‌బ్లిక్‌లో దాన్ని డిస్‌ప్లేకు పెట్టిన త‌ర్వాత ప్రైవేట్ డిన్న‌ర్ కోసం దాన్ని త‌ర‌లించారు. ఆ డిన్న‌ర్‌కు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా హాజరు అయ్యార‌ట‌. కేవ‌లం ఆ గోల్డ్ క్యూబ్‌ను చూడ‌టం కోస‌మే సెల‌బ్రిటీలు కూడా ప్రైవేటు డిన్న‌ర్‌కు క్యూ క‌ట్టారు..



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

Constitution Day of India: 75వ రాజ్యాంగ దినోత్సవం, ప్రాథమిక హక్కులు- భారత పౌరులకు అందించిన గొప్ప వరం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ

Red Stream on Hyderabad Roads: హైదరాబాద్‌ లోని జీడిమెట్లలో రోడ్డు మీద ఏరులై పారిన ఎర్రటి ద్రవం.. రక్తమేమోనని స్థానికుల ఆందోళన.. చివరకు తేలింది ఏమంటే? (వీడియోతో)