Premature Baby: 5 నెలలకే పుట్టాడు, గిన్నీస్ బుక్‌లోకి ఎక్కాడు. అమెరికాలో అసాధారణ చిన్నారి, ఆరు నెలల పాటూ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన బాబు
కొన్ని కేసుల్లో మాత్రమ 7 నెలలకే డెలవరీ అవుతారు. అయితే అలబామాకు చెందిన ఓ మహిళ మాత్రం 5 నెలలకే ప్రసవించింది. గిన్నీస్‌బుక్ రికార్డు సృష్టించింది.
Alabama November 12: సాధారణంగా మహిళ తన బిడ్డను తొమ్మిది నెలల పాటూ కడుపులో మోస్తుంది. కొన్ని కేసుల్లో మాత్రమ 7 నెలలకే డెలవరీ అవుతారు. అయితే అలబామాకు చెందిన ఓ మహిళ మాత్రం 5 నెలలకే ప్రసవించింది. గిన్నీస్‌బుక్ రికార్డు సృష్టించింది.
నెలలు నిండకముందు జన్మించిన పిల్లల్లో నూటికి 90 మంది పిల్లలు పుట్టగానే చనిపోతారు. అయితే అలబమాకు చెందిన ఓ మహిళ గర్భం దాల్చిన 21 వారాలకే డెలివరీ అయింది. దీంతో 420 గ్రాముల బరువుతో బిడ్డ పుట్టాడు. అతడిని కాపాడుకోవడం కోసం చాలా కష్టాలు పడింది ఆ మహిళ. ప్రస్తుతం తన కొడుకు పుట్టి 16 నెలలు అవుతుంది. ఇప్పుడు ఏ సమస్యా లేదు. అందరు పిల్లల్లాగానే ఆ పిల్లాడు కూడా ఆడుకుంటాడు. ఆహారం తింటాడు. నవ్వుతాడు.. ఏడుస్తాడు.. అన్నీ చేస్తాడు.
అలా 5 నెలలకే పుట్టి, బతికిన వాళ్లు చాలా అరుదు. అందుకే ఆ చిన్నారి పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కించారు. ప్రపంచంలో అత్యంత తక్కువ నెలల్లో పుట్టి బతికిన పసికందుగా నమోదు చేశారు.
నిజానికి ఆ మహిళ కవలలకు జన్మనిచ్చింది. అందులో ఒకరు అమ్మాయి. మరొకరు అబ్బాయి. పుట్టగానే అమ్మాయి చనిపోయింది. కానీ, అబ్బాయి మాత్రం వైద్యానికి సహకరించడంతో వైద్యులు ఆ పిల్లాడని కాపాడగలిగారు. దాదాపు 9 నెలల పాటు బాబును ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం అందించారు.