CCPA Shock to Ola Electric: ఓలా క‌స్ట‌మ‌ర్ల నుంచి ఏకంగా ప‌దివేల‌కు పైగా ఫిర్యాదులు, కంపెనీపై విచార‌ణ‌కు ఆదేశించిన వినియోగ‌దారుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ సంస్థ‌

కస్టమర్ల హక్కులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో సీసీపీఏ విచారణకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

OLA

New Delhi, NOV 14: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)కు గట్టి షాక్ తగిలింది. ఈవీ స్కూటర్లకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సర్వీసు ప్రమాణాలు, స్కూటర్లలో తలెత్తే సమస్యల పరిష్కారంలో లోపాలపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) విస్తృత విచారణకు ఆదేశించింది. కస్టమర్ల హక్కులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో సీసీపీఏ విచారణకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) సర్వీసు, చార్జింగ్, వారంటీ, సేవల్లో అసంతృప్తి తదితర అంశాలపై సీపీఏకు పది వేల ఫిర్యాదులు రావడం గమనార్హం. ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని ఓలా ఎలక్ట్రిక్ యాజమాన్యానికి గత నెల ఏడో తేదీన సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. కానీ తమకు వచ్చిన ఫిర్యాదులపై 99.1 శాతం పరిష్కరించామని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొన్నది.

Toyota Rumion:టయోటా రూమియన్ పండుగ ఎడిషన్ విడుదల, ధర రూ. .10.44 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.13.73 లక్షల వరకు.. 

ఓలా ఎలక్ట్రిక్ ప్రతిస్పందనను సమీక్షించిన తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను సవివరంగా విచారించాలని సీసీపీఏ కోరిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి నిధి ఖరే చెప్పారు. దీనిపై స్పందించడానికి ఓలా ఎలక్ట్రిక్ ముందుకు రాలేదు. 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ను సీసీపీఏ కోరింది. చార్జింగ్, ఫ్రీ సర్వీస్, వారంటీ, సేవల్లో అసంతృప్తి, వారంటీ తిరస్కృతి, సర్వీసింగ్ తర్వాత లోపాలు, ప్రచారంతో పోలిస్తే పనితీరులో లోపం తదితర సమస్యలు ఉన్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif