Hyundai Creta N Line: హ్యుందార్ క్రెటాకు పెరుగుతున్న క్రేజ్.. 'ఎన్ లైన్' పేరుతో సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసిన కంపెనీ, కొత్త వెర్షన్ కారులో ప్రత్యేకతలు ఏమిటి.. ధర ఎంత? ఇక్కడ తెలుసుకోండి!

Hyundai Creta N Line | Pic- Hyundai India Official

Hyundai Creta N Line: 2024 హ్యుందాయ్ క్రెటా కారుకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని సేల్స్ మరింత పెంచుకునే దిశగా కంపెనీ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే సరికొత్తగా 'హ్యుందార్ క్రెటా- ఎన్ లైన్' పేరుతో మరొక సరికొత్త వేరియంట్‌ను హ్యుందాయ్ ఇండియా విడుదల చేసింది. ఇది N8 మరియు N10 అనే రెండు వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఎక్స్-షోరూమ్ వద్ద ఈ కొత్త వేరియంట్ కారు ధరలు రూ. 16.82 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 22 లక్షల వరకు ఉంది. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, రూ. 25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కొత్త కారును బుక్ చేసుకోవచ్చు.

వేరియంట్ వారీగా హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ధరలు (ఎక్స్-షోరూమ్) క్రింద ఉన్నాయి.

N8/ 1.5l T-GDi 6MT వేరియంట్  రూ. 16,82,300

N8 / 1.5l T-GDi 7DCT వేరియంట్  రూ. 18,32,300

N10/ 1.5l T-GDi 6MT వేరియంట్ రూ. 19,34,300

N10/ 1.5l T-GDi 7DCT వేరియంట్ రూ. 20,29,900

ఈ కొత్త మిడ్-సైజ్ SUV భారతీయ రహదారులపై కియా సెల్టోస్ X-లైన్, స్కోడా కుషాక్ మోంటే కార్లో, వోక్స్‌వ్యాగన్ టైగన్ GT ప్లస్, టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌ మొదలైన వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా- ఎన్ లైన్ కారులో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Hyundai Creta N Line డిజైన్ 

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ దాని స్టాండర్డ్ క్రెటా మోడల్ కంటే భిన్నమైనది. డిజైన్ పరంగా మరింత స్పోర్టియర్ లుక్ ఉంటుంది. పనితీరు పరంగానూ మరింత మెరుగుపరచబడింది. మరింత నియంత్రణ కలిగిన హ్యాండ్లింగ్, పెరిగిన ఎగ్జాస్ట్ నోట్‌ను కలిగి ఉంది.

బయటివైపు గుర్తించదగిన మార్పులను పరిశీలిస్తే, రీడిజైన్ చేయబడిన గ్రిల్, బంపర్‌లు, 18-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్‌పై N లైన్ చిహ్నం కలిగి ఉంది. అలాగే, బ్లాక్-అవుట్ ORVMలు, పైకప్పు పట్టాలు, C-పిల్లర్ గార్నిష్, ఏరోడైనమిక్ స్పాయిలర్, ట్విన్-టిప్ ఎగ్జాస్ట్ అందించారు. అదనంగా క్రెటా ఎన్ లైన్‌లో స్పోర్టియర్ సస్పెన్షన్ కూడా ఉందని హ్యుందాయ్ పేర్కొంది.

వాహనం లోపల లేఅవుట్‌ స్టాండర్డ్ క్రెటాలాగే ఉంటుంది. అయితే, పూర్తి-నలుపు యాక్సెంట్‌లను కలిగి ఉంది, ఆపై ఎరుపు ఇన్సర్ట్‌లు, రెడ్ యాంబియంట్ లైటింగ్, డాష్‌క్యామ్‌తో పాటు మెటల్ యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్గేర్ నాబ్, స్టీరింగ్ వీల్‌పై 'N' బ్యాడ్జింగ్, లెథెరెట్ సీట్లు ఈ 5-సీటర్ SUV యొక్క స్పోర్టీ, అధునాతన వాతావరణాన్ని అందిస్తుంది.

Hyundai Creta N Line ఇంజన్ సామర్థ్యం, ఇతర ఫీచర్లు

క్రెటా N లైన్‌లో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్ ద్వారా పనితీరును ప్రదర్శిస్తుంది. ఇది 160 hp శక్తిని, 253 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త మోడల్ లీటరుకు 18 kmpl మైలేజీని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.

ఫీచర్ల పరంగా, హ్యుందాయ్ క్రెటా N లైన్‌లో 10.25-అంగుళాల HD ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్, స్మార్ట్‌సెన్స్ లెవల్ 2 ADAS, ముందు వెంటిలేటెడ్ సీట్లు, 8-వే పవర్డ్ డ్రైవర్ సీటు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్ పనోరమిక్ సన్‌రూఫ్, బ్లూలింక్ కనెక్ట్ ఫీచర్లు, వాయిస్ రికగ్నిషన్ మొదలైన అన్ని ఫీచర్లు ఉన్నాయి. అదేవిధంగా అన్ని వేరియంట్‌లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గాఅందిస్తున్నారు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif