Scorpio-N Z8 Select: మహీంద్రా స్కార్పియోలో మరొక స్టైలిష్ వేరియంట్‌ లాంచ్, 'ఎన్ జెడ్8 సెలెక్ట్' పేరుతో కొత్త మోడల్ విడుదల, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ SUV ధర, ఇతర వివరాలు తెలుసుకోండి!

Mahindra Scorpio-N Z8 Select | Pic: Official Website

Mahindra Scorpio-N Z8 Select : దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా తన బ్రాండ్ నుంచి  SUV సెగ్మెంట్‌లో ప్రముఖ మోడల్ అయిన మహీంద్రా స్కార్పియో వాహనానికి 'ఎన్ జెడ్8 సెలెక్ట్' పేరుతో మరొక కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త Scorpio-N Z8 Select వేరియంట్ దీని టాప్-ఎండ్ వేరియంట్‌లు అయిన Z8 మరియు Z8L కంటే కాస్త దిగువన ఉంటుంది. Scorpio-N Z8 Select వేరియంట్ పెట్రోల్ , డీజిల్ రెండు వెర్షన్ లలో లభిస్తుంది అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్ వాహనం ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 16.99 లక్షల నుండి రూ. 18.99 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది. ధరల పట్టికను ఈ కింద పరిశీలించండి.

Scorpio-N Z8 Select పెట్రోల్‌ వెర్షన్ ధరలు

MT (మ్యాన్యువల్ గేర్ బాక్స్) - రూ 16.99 లక్షలు

AT (ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ) రూ 18.49 లక్షలు

Scorpio-N Z8 Select డీజిల్ వెర్షన్ ధరలు

MT - రూ 17.99 లక్షలు

AT - రూ 18.99 లక్షలు

Scorpio-N Z8 Select -స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

స్కార్పియో ఎన్ జెడ్8 సెలెక్ట్ వేరియంట్‌ స్టైలిష్ మిడ్‌నైట్ బ్లాక్ కలర్ స్కీమ్‌లో లభిస్తుంది. వెలుపల డిజైన్ ఎలిమెంట్లను పరిశీలిస్తే.. 17-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌, LED DRLలతో డబుల్ బారెల్ LED హెడ్‌ల్యాంప్‌లు, LED ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్‌లు, LED సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లు ఉన్నాయి.

లోపల, కాఫీ-బ్లాక్ లెథెరెట్ అప్‌హోల్‌స్టరీ, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బిల్ట్-ఇన్ అలెక్సా, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్, ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సహా ఇతర అనేక ఫీచర్‌ల యొక్క అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది.

భద్రతపరంగా, ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డంపింగ్ (FDD), మల్టీ-ట్యూన్డ్ వాల్వ్ సెంట్రల్ ల్యాండ్ (MTV-CL), నాలుగు డిస్క్ బ్రేక్‌లు, ABS, ESP, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Scorpio-N Z8 Select ఇంజన్ సామర్థ్యం

Scorpio-N Z8 Select పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. వీటిలో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 197 బిహెచ్‌పి శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అయితే 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ 173 బిహెచ్‌పి శక్తిని, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌ని ఎంచుకోవచ్చు.

కొత్త Scorpio-N Z8 Select మార్చి 1 నుండి డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైనాయి, ముందుగా బుక్ చేసుకున్నవారికి అనుకున్న సమయానికి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.



సంబంధిత వార్తలు

Mumbai Ferry Boat Tragedy: నేవీ బోటును ఢీకొనడంతోనే ముంబై పడవ ప్రమాదం, 13 మంది మృతి చెందినట్లు ప్రకటించిన సీఎం ఫడ్నవిస్, మృతుల కుటుంబాలకు రూ. రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

New Year 2025 Travel plans: నూతన సంవత్సరం 2025 వేడుకలను సముద్ర బీచ్ లో జరుపుకోవాలని అనుకుంటున్నారా..అయితే ఏపీలో టాప్ బీచ్ స్పాట్స్ ఇవే..

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif