Maruti Suzuki Jimny 5-Door: మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వచ్చేస్తోంది, జూన్ నుంచి ప్రారంభం కానున్న విక్రయాలు, ఆ తరువాత వారంలోనే డెలివరీలు

దీని విక్రయాలు జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధర కాకుండా ఈ కారు గురించి దాదాపు అన్ని వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి.

Maruti Suzuki Jimny (Photo Credits: Maruti Suzuki Nexa Website)

భారత్‌లో మారుతి సుజుకీ జిమ్నీ 5-డోర్స్ సిరీస్ ఉత్పత్తి ప్రారంభమైంది. దీని విక్రయాలు జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధర కాకుండా ఈ కారు గురించి దాదాపు అన్ని వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. బుకింగ్స్ కూడా దాదాపు 30వేలకు చేరువలో ఉన్నట్లు సమాచారం. మారుతి సుజుకి జిమ్నీ ధరలు జూన్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత వారంలో డెలివరీలు మొదలవుతాయని అంచనా.

మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్‌ల కోసం వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం దాదాపు ఆరు నెలల వరకు ఉంది. అదే సమయంలో ఆటోమేటిక్ వెయిటింగ్ పీరియడ్ ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉంటుంది. నాలుగు వేరియంట్లలో విడుదలకానున్న జిమ్నీ టాప్ స్పెక్ వేరియంట్ 'ఆల్ఫా'కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది.

జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే కలర్ ఆప్షన్లలో విడుదలవుతుంది. 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్‌ కలిగిన జిమ్నీ 105 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మారుతి సుజుకి తన గురుగ్రామ్ ప్లాంట్‌లో ప్రతి సంవత్సరం 1 లక్ష యూనిట్ల జిమ్నీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 66 శాతం దేశీయ విక్రయాలకు, మిగిలిన 34 శాతం ఎగుమతులకు కేటాయించే అవకాశం ఉంది. అంతే కాకుండా కంపెనీ కేవలం భారతీయ మార్కెట్ కోసం ప్రతి నెల 7,000 యూనిట్లు కేటాయించాలని దానివైపు అడుగులు వేస్తోంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif