Maruti Suzuki: కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన మారుతి సుజుకి, 11,177 గ్రాండ్‌ విటారా కార్ల‌ను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడి, రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్స్ స‌మ‌స్యే కారణం

తన పాపులర్‌ మోడల్‌ గ్రాండ్‌ విటారాకు సంబంధించి 11,177 కార్ల‌ను రీకాల్ చేస్తున్న‌ట్లు (Maruti Suzuki Recalls 11,177 Units Of Grand Vitara) ప్ర‌క‌టించింది.

2022 Maruti Suzuki Grand Vitara (Photo Credits: Maruti Suzuki)

భారత దేశ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తన పాపులర్‌ మోడల్‌ గ్రాండ్‌ విటారాకు సంబంధించి 11,177 కార్ల‌ను రీకాల్ చేస్తున్న‌ట్లు (Maruti Suzuki Recalls 11,177 Units Of Grand Vitara) ప్ర‌క‌టించింది. ఈ కార్ల‌లో రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్స్ స‌మ‌స్య (Faulty Seat Belt Mounting Brackets)కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గ‌త ఏడాది ఆగ‌స్టు ఎనిమిది నుంచి న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు త‌యారైన గ్రాండ్ విటారా కార్ల‌ను రీకాల్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్ల‌లో స‌మ‌స్య త‌లెత్తింది. దూర ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు రేర్ సీట్ బెల్ట్ లూజ్ (rear seat belt mounting brackets) అయ్యే అవ‌కాశం ఉంద‌ని, దానివ‌ల్ల పనితీరు దెబ్బ తింటుంద‌ని మారుతి తెలిపింది. గ‌త ఆగ‌స్టు – నవంబ‌ర్ మ‌ధ్య త‌యారైన గ్రాండ్ విటారా కార్లు కొనుగోలు చేసిన వినియోగ‌దారుల‌కు త‌మ డీల‌ర్ల ద్వారా స‌మాచారం అందుతుంద‌ని తెలిపింది.

మారుతి జిమ్నీ వాహనానికి 8 రోజుల్లో 9 వేల బుకింగ్ లు.. ప్రత్యేకతలు ఏంటంటే?

దెబ్బ తిన్న విడి భాగాల‌ను ఉచితంగా రీ ప్లేస్ చేస్తామ‌ని మారుతి ప్రకటించింది.కాగా ఎయిర్‌బ్యాగ్ లోపం కార‌ణంగా వివిధ మోడ‌ళ్ల‌కు చెందిన‌ 17,362 కార్లు ఇటీవల మారుతి రీకాల్ చేసింది. ముఖ్యంగా ఆల్టో కే10, ఎస్‌-ప్రెస్సో, ఈకో, బ్రెజా, బాలెనో, గ్రాండ్ విటారా మోడ‌ల్ కార్లు ఉన్న సంగతి తెలిసిందే.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif