Newdelhi, Jan 23: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) నుంచి వస్తున్న సరికొత్త ఆఫ్ రోడ్ వాహనం జిమ్నీ(Jimny). కొద్దిగా రెట్రో లుక్ తో కనిపించే జిమ్నీ గత డిసెంబరులో నిర్వహించిన ఆటో ఎక్స్ పోలో (Auto Expo) అందరికీ దర్శనమిచ్చింది. కాగా, ఈ వాహనానికి ఇటీవల బుకింగ్ లు ప్రారంభం కాగా, 8 రోజుల్లోనే 9 వేల బుకింగ్ లు నమోదు కావడం విశేషం. జిమ్నీకి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా బుకింగ్ సమయంలో చెల్లించే అడ్వాన్స్ పేమెంట్ మొత్తాన్ని రూ.11 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు.
మిహోస్ ఈ-బైక్ బుక్సింగ్స్ ను ప్రారంభించిన కంపెనీ.. మార్చి నుంచి డెలివరీ
5 డోర్లతో, ఆకట్టుకునే రూపంతో ఉన్న జిమ్నీలో అనేక ఫీచర్లు పొందుపరిచారు. రౌండ్ హెడ్ ల్యాంప్స్, పెద్ద విండోలు, టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్, చంకీ వెర్టికల్ స్లాట్స్ కూడిన ఫ్రంట్ గ్రిల్, వెనుక బంపర్ పై టెయిల్ లైట్స్, ఆల్ గ్రిప్ ఫోర్ వీల్ డ్రైవ్, లో రేంజ్ ట్రాన్స్ పర్ గేర్ బాక్స్, 210 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 9 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగ్ లు, హిల్ హోల్డ్ కంట్రోల్ (ఎత్తయిన ప్రాంతాలకు ఎక్కేటప్పుడు పట్టు జారకుండా), హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ప్రత్యేకతలు మారుతి జిమ్నీలో ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. దీని ప్రారంభ ధర రూ.9 లక్షలు (జెటా ఎంటీ వేరియంట్ ఎక్స్ షోరూం ధర) అని తెలుస్తోంది.
Maruti Suzuki Jimny is unveiled at Auto Expo. Known for its Off Road Capabilities and Rugged Chasis, it is surely going to be beloved of Indian SUV Lovers.
MarutiSuzukiAtAutoExpo#FutureOfMobility#AutoExpo2023#MarutiSuzuki pic.twitter.com/UxhUIUr8Eo
— Krishan Kumar (@kksinghmar) January 22, 2023