Ola Hyperchargers: ఓలా బంపర్ ఆఫర్, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ యూజర్లకు హైపర్‌ ఛార్జింగ్‌ పాయింట్ల దగ్గర ఉచితంగా ఛార్జింగ్‌, భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఓలా

ఓలా మరో అడుగు ముందుకు వేసింది.పెట్రోల్‌ బంకుల తరహాలోనే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ యూజర్లకు ఛార్జింగ్‌ (Ola Hyperchargers) సౌకర్యం అందించే లక్ష్యంతో భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌తో ఓలా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ఉన్న భారత్‌ పెట్రోల్‌ బంకుల్లో ఓలా సంస్థ హైపర్‌ ఎలక్ట్రిక్‌ ఛార్జర్లను ఏర్పాటు చేయనుంది.

Ola Hyperchargers (Photo-Twitter/ Bhavish Aggarwal)

ఓలా మరో అడుగు ముందుకు వేసింది.పెట్రోల్‌ బంకుల తరహాలోనే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ యూజర్లకు ఛార్జింగ్‌ (Ola Hyperchargers) సౌకర్యం అందించే లక్ష్యంతో భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌తో ఓలా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ఉన్న భారత్‌ పెట్రోల్‌ బంకుల్లో ఓలా సంస్థ హైపర్‌ ఎలక్ట్రిక్‌ ఛార్జర్లను ఏర్పాటు చేయనుంది.

ఈ విషయాన్ని ఓలా స్కూటర్స్‌ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) ట్విట్టర్‌లో స్వయంగా ప్రకటించారు. భారత్‌ పెట్రోలు బంకుల్లో (Bharat Petroleum Corporation Limited (BPCL) pumps) హపర్‌ ఛార్జింగ్‌ పాయింట్లు 6 నుంచి 8 వారాల్లోగా అందుబాటులోకి వస్తాయంటూ భవీశ్‌ తెలిపారు. పెట్రోలు బంకులతో పాటు ఇళ్ల సముదాయల దగ్గర కూడా హైపర్‌ ఛార్జింగ్‌ పాయింట్లు తెస్తామంటూ శుభవార్త తెలిపారు. పబ్లిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లు అందుబాటులోకి తెస్తున్న సందర్భంగా భవీశ్‌ అగర్వాల్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.

Here's Bhavish Aggarwal Tweet

భారత్‌ పెట్రోలు బంకులు, రెసిడెన్షియల్‌ కాంప్లెక్సు‍ల దగ్గర ఓలా సంస్థ నెలకొల్పే హైపర్‌ ఛార్జింగ్‌ పాయింట్ల దగ్గర ఉచితంగా ఛార్జింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. 2022 జూన్‌ 30 వరకు ఈ ఆఫర్‌ని అందిస్తున్నారు. ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లకు సంబంధించి ఒక యూనిట్‌ కరెంట్‌కి రూ. 12 నుంచి రూ.15 వరకు విద్యుత్‌ సంస్థలు ఛార్జ్‌ చేస్తున్నాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Injections For Back Pain Not Good: నడుం నొప్పికి వెన్ను ఇంజెక్షన్లు ఇస్తున్నారా? వద్దేవద్దు అంటున్న శాస్త్రవేత్తలు.. ఎందుకంటే?

Special Buses For Maha Shivarathri: మహాశివరాత్రి సందర్భంగా శివయ్య దర్శనానికి వెళ్లాలనుకున్నవారికి గుడ్ న్యూస్.. 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్‌ సొమ్ము విత్‌ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Free Chicken Distribution In Guntur: హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్‌ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)

Share Now