Gold Price In Hyderabad: మహిళలకు బ్యాడ్ న్యూస్, బంగారం ధర పెరుగుతోంది, ఒక్క రోజులోనే తులం బంగారంపై రూ.200 పెరుగుదల, త్వరలోనే రూ.50 వేల వైపు పరుగులు..
బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర బుధవారం (ఫిబ్రవరి 9) పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 49,530కు చేరింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 9: బంగారం రేటు పరుగులు పెడుతోంది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర బుధవారం (ఫిబ్రవరి 9) పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 49,530కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 45,400 ఎగసింది. బంగారం ధరలు పైకి కదిలితే వెండి కూడా పైకి చేరింది. రూ.200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,100కు ఎగసింది.
ముంబైలో కూడా బంగారం ధర పెరిగింది.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 పైకి కదిలింది. రూ. 49,530కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరుగుదలతో రూ. 45,400కు ఎగసింది. వెండి రేటు రూ. 300 పెరుగుదలతో రూ. 61,900కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరుగుదలతో రూ.49,530కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇలానే పైకి కదిలింది. రూ.200 పెరుగుదలతో రూ.45,400కు చేరింది. వెండి ధర రూ.300 పైకి కదిలింది. దీంతో సిల్వర్ రేటు రూ.61,900కు ఎగసింది. గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.