No Mass Layoffs In Flipkart: మాస్ లేఆఫ్స్ మా కంపెనీలో ఉండవు.. ఉద్యోగులకు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిష్ణ రాఘవన్ గుడ్ న్యూస్
కావాల్సిన మేరకే ఉద్యోగులను తీసుకుంటున్నామని, మాస్ లేఆఫ్స్ (Mass Layoffs) తమ కంపెనీలో ఉండవని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిష్ణ రాఘవన్ స్పష్టం చేశారు.
Newdelhi, March 28: మాంద్యం భయాలు, ఉద్యోగుల కోతలు పెరుగుతున్న సమయంలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కావాల్సిన మేరకే ఉద్యోగులను తీసుకుంటున్నామని, మాస్ లేఆఫ్స్ (Mass Layoffs) తమ కంపెనీలో ఉండవని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిష్ణ రాఘవన్ స్పష్టం చేశారు. 'మేము అవసరమైన మేరకే నియామకాలు చేపడతాము. ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్డులో మాస్ లేఆఫ్స్ అనేదే జరగలేదు, జరగదు కూడా. మేము వేల సంఖ్యలో నియమించుకోము. ఆ తర్వాత కంపెనీలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారనే కారణంతో వారని తొలగించి కఠిన నిర్ణయాలు తీసుకోము.' అని పేర్కొన్నారు.
సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారులకు ప్రమోషన్లు, హైక్‌లు ఇవ్వకూడదని ఫ్లిప్‌కార్ట్ నిర్ణయించినట్లు సమాచారం. దీని ద్వారానే కంపెనీలో మాస్ లేఆఫ్స్ జరగకుండా పరిస్థితులు ఏర్పడినట్లు తెలిసింది.