Home Loan on PhonePe: ఫోన్ పేలో ఇకపై గోల్డ్, బైక్, కారు, హోమ్, ఎడ్యుకేషన్ లోన్లు.. బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీలతో ఫోన్ పే ఒప్పందం
ప్రముఖ యూపీఐ పేమెంట్ సర్వీసుల సంస్థ ఫోన్ పే తన కస్టమర్ల కోసం కొత్తగా ఆరు విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్ లను అందుబాటులోకి తెచ్చింది.
Hyderabad, May 31: ప్రముఖ యూపీఐ (UPI) పేమెంట్ సర్వీసుల సంస్థ ఫోన్ పే (PhonePe) తన కస్టమర్ల కోసం కొత్తగా ఆరు విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్ (Secured Loan Schemes) లను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), టాటా క్యాపిటల్, ఎల్&టీ ఫైనాన్స్, డీఎంఐ హౌసింగ్ ఫైనాన్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, రూపే, వోల్ట్ మనీ, గ్రాడ్‌రైట్, హీరో ఫిన్‌కార్ప్, ముత్తూట్ ఫిన్‌కార్ప్ వంటి ఫిన్ టెక్ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నట్టు ఫోన్ పే ప్రకటించింది.
ఏయే రుణాలు ఇస్తారంటే?
వినియోగదారులకు మ్యూచువల్ ఫండ్, గోల్డ్, బైక్, కారు, హోమ్/ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ లోన్లను అందిస్తున్నట్టు గురువారం ఫోన్ పే సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.