30 Years for Aditya 369: శ్రీకృష్ణదేవరాయలు పాత్ర బాలయ్య చేస్తేనే సినిమా తీస్తా, ఆదిత్య 369 సినిమా 30 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్న చిత్ర యూనిట్

ఈ సినిమా విడుదలై జులై 18వ తేదీకి 30ఏళ్లు పూర్తి (30 Years for Aditya 369) చేసుకుంది.

30 Years for Aditya 369 (Photo-Wikimedia Commons)

బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్‌ మూవీ ‘ఆదిత్య 369’ (Aditya 369) ఎంతటి సంచలనాలను నమోదు చేసిందో తెలుగు సినీ ప్రేమికులందరికీ తెలుసు. ఈ సినిమా విడుదలై జులై 18వ తేదీకి 30ఏళ్లు పూర్తి (30 Years for Aditya 369) చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక స్పెషల్‌ వీడియోను విడుదల చేసింది. వైవిధ్య చిత్రాలను ప్రేక్షకులకు చూపించాలని తపన పడే దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు నుండి జాలువారిన సోషియో ఫాంటసీతో కూడిన క్లాసిక్ మూవీ ఆదిత్య 369.

ఈ చిత్రంలో హైలెట్ టైమ్‌ మెషీన్‌.. దీని గురించి సింగీతం శ్రీనివాసరావు (Director Singeetam Srinivasa Rao) కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘‘ఆదిత్య 369’ క్రియేట్‌ చేసింది నేనయితే టైం మెషిన్ మాత్రం హెచ్‌జీ వెల్స్‌ రాసిన నవలలో నుంచి తీసుకున్నదని తెలిపారు. ఈ కథను ముందుగా ఒక విమాన ప్రయాణంలో దివంగత బాలుగారికి చెప్పానని అయితే ఆయన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌కు చెప్పమన్నారని తెలిపారు.

నిర్మాతకు కథ చెప్పగా శ్రీకృష్ణదేవరాయలు పాత్ర నందమూరి బాలకృష్ణ చేస్తేనే.. లేకపోతే ఈ సినిమా లేదు’ అన్నారని దర్శకుడు తెలిపారు. ఈ కథను బాలయ్యకు వినిపించడం, ఆయన కూడా ఓకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కింది. ఇక సినిమాకు సీక్వెల్‌ అంటారా? అది కూడా చేసేద్దాం’’ అని దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘ఆదిత్య 369’తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)మాట్లాడుతూ.. ‘‘ఆదిత్య 369 విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు. ఎన్నిసార్లు చూసినా అదొక అద్భుతం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడు ప్రసారమైనా ఆ సినిమాను చూస్తూనే ఉంటారు. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కానీ, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన కొన్ని చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి.

రాత్రిపూట తినడం మానేశా, అందుకే నా చర్మకాంతి మెరుగైంది, గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తున్నానని తెలిపిన తమన్నా, కుకింగ్‌ షో ‘మాస్టర్‌ చెఫ్‌’ తెలుగు వెర్షన్‌తో హోస్ట్‌గా త్వరలో ఎంట్రీ

ఈ సినిమా కార్యరూపం దాల్చడంలో ప్రధాన పాత్ర అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంది. ఇలాంటి సినిమాలు తీయాలంటే దర్శకుడికి ధైర్యం, నిర్మాతకు ప్యాషన్‌ ఉండాలి. హీరోకు రెండూ ఉండాలి. ఈ సినిమాకు గుండెకాయ శ్రీకృష్ణదేవరాయలు పాత్ర. ప్రతి విషయంలోనూ ఆచితూచి సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి సినిమా చేయడం నా పూర్వ జన్మ సుకృతం. ఇక ముందు ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలన్న నిర్ణయానికి వచ్చాం’’ అని అన్నారు.