68th Hyundai Filmfare Awards 2023: అట్టహాసంగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డుల వేడుక.. ఉత్తమ నటీనటులుగా అలియాభట్, రాజ్‌కుమార్‌రావ్.. హాజరైన పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు.. విజేతల పూర్తి జాబితా ఇదిగో..

సల్మాన్‌ఖాన్, మనీశ్ పాల్ హోస్టులుగా వ్యవహరించిన ఈ అవార్డుల వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ‘గంగూబాయి కథియావాడి’, ‘బాదాయ్ దో’ సినిమాలకు అవార్డులు వచ్చి పడ్డాయి.

Filmfare Awards (Credits: Twitter)

Mumbai, April 28: 68వ హుందై ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్ 2023 (Hyundai Filmfare Awards) వేడుక గత రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. సల్మాన్‌ఖాన్ (Salman Khan), మనీశ్ పాల్ హోస్టులుగా వ్యవహరించిన ఈ అవార్డుల వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.  ‘గంగూబాయి కథియావాడి’ (Gangubai Kathiawadi), ‘బాదాయ్ దో’ సినిమాలకు అవార్డులు (Awards) వచ్చి పడ్డాయి. గంగూబాయి కథియావాడి సినిమా ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా 9 విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు సహా ఆరు కేటగిరీల్లో బాదాయ్ దో సినిమా అవార్డులు గెలుచుకుంది. ఇక అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న ‘కశ్మీర్ ఫైల్స్‌’ సినిమాకు ఒక్క అవార్డు కూడా రాలేదు.

Tamannaah- Vijay Varma Relation: నా తమన్నాతో తిరుగుతూ భలే బుద్ది చెప్పావ్! షాకింగ్ కామెంట్స్ చేసి బాలీవుడ్ నటుడు, ఇన్‌స్టా వేదికగా తమన్నా ప్రేమవ్యవహారంపై వైరల్ పోస్ట్

అవార్డులు అందుకున్నది వీరే..

ఉత్తమ చిత్రంగా గంగూబాయి కథియావాడి సినిమా ఎంపిక కాగా, అదే సినిమాకు దర్శకత్వం వహించిన సంజయ్ లీలా బన్సాలీ ఉత్తమ దర్శకుడిగా, కథానాయికగా చేసిన అలియా భట్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. బదాయ్ దో సినిమాకు గాను రాజ్‌కుమార్ రావ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. అదే సినిమాలో నటించిన షీబీ చద్దా ఉత్తమ సహాయనటి అవార్డు అందుకుంది. అలాగే, ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) బదాయ్ దో (హర్షవర్ధన్ కులకర్ణి), ఉత్తమ నటుడు (క్రిటిక్స్) సంజయ్ మిశ్రా (వధ్), ఉత్తమ నటి (క్రిటిక్స్) టబు (భూల్ భులయా2), భూమి పెడ్నేకర్ (బదాయ్ దో), ఉత్తమ సహాయ నటుడిగా జగ్‌జగ్ జీయో సినిమాకు గాను అనిల్ కపూర్ అవార్డులు అందుకున్నారు.

హాజరైన ప్రముఖులు

అలియా భట్, జాన్వీ కపూర్, భూమి పడ్నేకర్, పూజ హెగ్డే, ఫాతిమా సనా ఖాన్, దియా మీర్జా, నర్గీస్ ఫక్రీ, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీలియోని, రేఖ, కాజోల్, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ సహా పలువురు బిగ్ సెలబ్రిటీలు ఈ వేడుకకు  హాజరయ్యారు.



సంబంధిత వార్తలు

Harish Rao Serious On Government: గురుకులాలా లేక నరక కూపాలా? రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ పాల‌న‌పై మాజీ మంత్రి హ‌రీష్ రావు తీవ్ర ఆగ్ర‌హం

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి

KTR on AMRUT Tender Scam: రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్రం విచారణ జరిపించాలి, అమృత్‌ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని తెలిపిన కేటీఆర్