Sonu Sood: ఆ డబ్బంతా పేదల కోసమే ఖర్చు చేస్తా, తన స్వచ్ఛంద సంస్థ ఎలాంటి సహాయం అందించడానికైనా సిద్ధంగా ఉందని తెలిపిన సోనూ సూద్
ఇటీవల కాలంలో తాను ప్రమోట్ చేస్తున్న పలు కంపెనీల నుంచి వచ్చే మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు లేదా ఆస్పత్రికి నేరుగా ఇప్పిస్తున్నట్లు తెలిపాడు.
ప్రముఖ నటుడు సోనూ సూద్.. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా కరోనా సంక్షోభంలో ఎందరినో ఆదుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తన చారిటీకి అంత డబ్బు ఎక్కడిదన్న అనుమానాలు చాలాసార్లు పలువురి నుంచి వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఆర్థిక వివరాల గురించి తాజా మీడియా సమావేశంలో సోను (Sonu Sood) వెల్లడించాడు. ఇటీవల కాలంలో తాను ప్రమోట్ చేస్తున్న పలు కంపెనీల నుంచి వచ్చే మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు లేదా ఆస్పత్రికి నేరుగా ఇప్పిస్తున్నట్లు తెలిపాడు.
అలాగే తన స్వచ్ఛంద సంస్థ ఎలాంటి సహాయం అందించడానికైనా సిద్ధంగా ఉందన్న ఆయన.. 'ఇటీవల దుబాయ్ పర్యటనలో ఆస్టర్ హాస్పిటల్స్‌కు చెందిన ఓనర్ విల్సన్ ప్రజలకు వైద్య సాయం చేయడంలో నాకు సహకరిస్తానని, దీంతో పాటు తన హాస్పిటల్‌ను కూడా ప్రమోట్ చేయాలని (promote hospitals) అన్నాడు. అయితే, ప్రతిఫలంగా దాదాపు రూ.12 కోట్ల ఖర్చుతో కూడిన 50 కాలేయ మార్పిడి ఆపరేషన్లకు ( give me 50 liver transplants) ఆర్థిక సాయం చేయాలని నేను అడిగితే ఆయన ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఆ సాయం అందిస్తున్నాం' అంటూ వివరించాడు. ఇలా ఎంతోమంది తనతో చేతులు కలుపుతున్నట్లుగా సోను చెప్పుకొచ్చాడు.