Srikanth Iyengar Row: బాధ కలిగించాను.. త్వరలోనే క్షమాపణ చెబుతా.. శ్రీకాంత్ అయ్యంగార్ (వీడియో)
సినీ సమీక్షకులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.
Hyderabad, Oct 28: సినీ సమీక్షకులపై (Review Writers) తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar Row) క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు. తన వ్యాఖ్యలతో రివ్యూ రైటర్లకు బాధ కలిగించానన్న ఆయన త్వరలోనే క్షమాపణ చెబుతా అంటూ వీడియో రిలీజ్ చేశారు. ‘పొట్టేల్’ మూవీ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్స్ పై తాను చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు ఆయన వీడియోలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
అసలేంటీ వివాదం?
‘పొట్టేల్’ మూవీ సక్సెస్ మీట్ లో సినీ సమీక్షకులపై, వారి సినీ సమీక్షలపై శ్రీకాంత్ అయ్యంగార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరేచనాలు, పురుగులు అంటూ కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీకాంత్ అయ్యంగార్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అప్పటివరకూ శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన సినిమాల మీడియా కార్యక్రమాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో రివ్యూ రైటర్లకు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.
అల్లు అర్జున్‌పై నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులను ఆదేశించిన ఏపీ హైకోర్టు