Jani Master With Family

Hyderabad, OCT 26: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్ర‌ముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ (Jani Master) మాస్ట‌ర్ నిన్న చంచ‌ల్‌గూడ‌ జైలు నుంచి విడుదలైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శ‌నివారం భావోద్వేగంతో కూడిన ఓ పోస్టును త‌న ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ 37 రోజుల్లో ఎంతో కోల్పోయానంటూ భావోద్వేగానికి లోన‌య్యారు. నా కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషుల ప్రార్థ‌న‌లు న‌న్ను ఇక్క‌డ‌కు తీసుకొచ్చాయని జానీ మాస్ట‌ర్ (Jani Master Release) పేర్కొన్నారు. లేడి డ్యాన్సర్‌ను లైంగికంగా వేధించాడంటూ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 20న అరెస్ట్ అయ్యాడు జానీ మాస్ట‌ర్. గ‌త 36 రోజులుగా జైలు జీవితం గ‌డిపిన జానీకి రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో శుక్ర‌వారం విడుద‌ల అయ్యారు. 2017లో ఓ టీవీ షోలో పాల్గోన్న ఒక మ‌హిళ కొరియోగ్రాఫర్‌తో జానీ మాస్ట‌ర్‌కు ప‌రిచ‌యం ఏర్పడింది. ఆ స‌మ‌యంలోనే జానీ త‌న టీంలో తీసుకున్నాడ‌ని.. నేను మైన‌ర్‌గా ఉన్న స‌మ‌యంలోనే ఒక హోట‌ల్‌లో జానీ త‌న‌పై హత్యాచారానికి పాల్పడ్డాడు అని యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

Jani Master Emotional Post about Family

 

అయితే ఈ ఫిర్యాదును స్వీక‌రించిన నార్సింగి పోలీసులు జానీ మాస్ట‌ర్‌పై ఐపీసీ 376, 506, 323 సెక్ష‌న్‌ల‌తో పాటు పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. యువ‌తి ఫిర్యాదు మేర‌కు జానీ మాస్ట‌ర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రోడ్యూస్ చేసి రిమాండ్‌కు త‌రలించారు. రీసెంట్‌గా జాతీయ అవార్డుల నేప‌థ్యంలో అక్టోబ‌ర్ 6 నుంచి 9వ తేదీ వ‌ర‌కు బెయిల్ కావాల‌ని కోర్టును కోర‌గా.. బెయిల్ మంజూరు చేసింది.

Allu Arjun: అల్లు అర్జున్‌పై నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులను ఆదేశించిన ఏపీ హైకోర్టు 

అయితే అవార్డును క్యాన్సిల్ చేసింది జాతీయ అవార్డుల క‌మిటీ. అనంత‌రం బెయిల్ గడువు ముగియడంతో మ‌ళ్లీ జైలుకు వెళ్లాడు జానీ. అయితే రెగ్యూల‌ర్ బెయిల్ కోసం పోక్సో కోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖలు చేయ‌గా.. దీనిని విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు అత‌డికి బెయిల్‌ను మంజూరు చేసింది.