పాన్ ఇండియా నటుడు అల్లు అర్జున్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబర్ 6 వరకు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. నవంబర్ 6న ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది.
కిరణ్ అబ్బవరం క మూవీ వట్రైలర్ విడుదల, అక్టోబర్ 31న విడుదల కానున్న సినిమా
ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి వచ్చారు. అయితే పట్టణ శివారు నుంచే అల్లు అర్జున్‌ను పెద్ద ఎత్తున వాహనాలతో రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి భారీ ర్యాలీతో తీసుకువచ్చారు. అల్లు అర్జున్ పర్యటనకు అధికారిక అనుమతులు లేకపోయినప్పటికీ పోలీసులు బందోబస్తు ఇచ్చారు. అయితే ఇది ఈసీ దృష్టికి వెళ్లగా... అల్లు అర్జున్, రవిచంద్ర కిశోర్ రెడ్డిపై నంద్యాల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.