Actress Samantha: అతను భర్త కాదు, మాజీ భర్త అనండి, రూ.250 కోట్లు తీసుకున్నా అనేది రూమర్స్, ఇద్దరినీ ఒకే రూంలో ఉంటే పొడుచుకుంటాం, కాఫీ వీత్ కరణ్ జోహార్ షోలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ ఎపిసోడ్ (Koffee With Karan Show) గత రాత్రి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది.
కాఫీ వీత్ కరణ్ జోహార్ షోలో స్టార్ హీరోయిన్ సమంత (Actress Samantha) తన జీవితంలో జరిగిన పెళ్లి-విడాకుల మీద కొన్ని సందేహాలకు సమాధానం ఇచ్చింది. ఈ ఎపిసోడ్ (Koffee With Karan Show) గత రాత్రి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. సమంత మాట్లాడుతూ.. మొదట్లో బాధఫడ్డా.. ప్రస్తుతం దాని నుంచి (Actress Samantha Reacts On Her Divorce) పూర్తిగా బయటపడ్డానని తెలిపింది.
అంతేకాదు మునపటి కంటే ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యానని పేర్కొంది. అలాగే ఈ షో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సామ్ చై గురించి అడిగే క్రమంలో కరణ్ జోహార్ మీ భర్త అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో వెంటనే మధ్యలో సమంత కల్పించుకుని ‘మాజీ భర్త’ అనాలి అంటూ కరెక్ట్ చేసింది.
వెంటనే కరణ్ సారీ చెబుతూ.. మీ మాజీ భర్త, మీరు విడిపోయినప్పుడు మీరే కారణమంటూ ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని భావించారా? అని అడగ్గా.. అవును, కానీ ప్రస్తుతం నేను దాని గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేను. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండటానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. ఒకవేళ స్పందించాలన్నా ఆ సమయంలో నా దగ్గర సమాధానాలు లేవు’ అని చెప్పుకొచ్చింది. అనంతరం నాగ చైతన్యకు మీకు మధ్య ఏవైన మనస్పర్థలు ఉన్నాయా అని అడగ్గా.. ‘మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది’ అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
ఇక సమంత నాగ చైతన్య నుంచి రూ. 250 కోట్లు భరణం తీసుకుందని కూడా ప్రచారం జరిగింది. ఇందులో నిజం లేదని సామ్ అప్పుడే స్పష్టం చేసింది. దీనిపై మాట్లాడుతూ.. మా విడాకులు అంత సామరస్యంగా జరగలేదు. డైవర్స్ తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. విడాకులు తీసుకున్న కొత్తలో చాలా బాధపడ్డాను. జీవితం చాలా కఠినంగా అనిపించింది.కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాను. మునుపటి కంటే ఇప్పుడే మరింత బలంగా మారాను. నేను రూ.250 కోట్లు తీసుకున్నట్లు చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఈ పుకార్లు వచ్చినప్పుడు నా ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేస్తారేమో అని ఎదురుచూశా’ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది.