బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన ప్రియుడు అదిల్ దురానీతో లవ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోన్న సంగతి విదితమే. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ (Rakhi Sawant) పలు విషయాలను షేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో తనను తరచూ ట్రోల్ చేస్తున్నారని..జనాలు ట్రోల్ చేయకపోతే మేము స్టార్స్ ఎలా అవుతాం? వాళ్ల పని వాళ్లను చేయనివ్వండి. మహా అయితే తిడతారు, కానీ చంపరు కదా అంటూ బోల్డ్ వ్యాఖ్యలు చేసింది. అందరూ మన గురించి స్వీట్‌గా మాట్లాడితే డయాబెటిక్స్ వస్తుంది. కాబట్టి జీవితంలో కొంత చేదు కూడా ఉండాలి.
ఇలాంటి ట్రోలింగ్ వల్ల మనిషి ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. కాకపోతే నా విషయంలో అలా జరగదులెండి. మీరు నన్నెంత మార్చాలనుకున్నా నేను నాకు నచ్చినట్లుగానే ఉంటాను. నేనేం ఎవరినీ హింసించట్లేదు, నిజాయితీగా మసులుకుంటూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్నా. ఎక్స్‌పోజింగ్ ఆపి వెళ్లి ఇంట్లో కూర్చో అనేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ నేను బాలీవుడ్‌లో ఎక్కువరోజులు ఉండటానికే అలా రెడీ అవుతాను. పొట్టి బట్టలు, చర్మం కనిపించేలా దుస్తులు ధరించడం వల్లే నాకంటూ కొంత గుర్తింపు వచ్చింది. దానికితోడు బాగా కష్టపడ్డాను కాబట్టే ఇండస్ట్రీలో ఉంటున్నానని చెప్పుకొచ్చింది.
నేను సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తున్నాను. కానీ నా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నాకు కేవలం అత్యాచార సన్నివేశాలు ఇస్తున్నారు. నాకది నిజంగా నచ్చడం లేదు. కేవలం ముద్దు సీన్లు ( I Get Only Kissing Scenes), రేప్ సీన్లలో మాత్రమే నేను ఎందుకు నటించాలి? నేను మంచి డ్యాన్సర్‌ను. ఇంతకుముందు ఐటం సాంగ్స్ కూడా చేశాను. అలాగే మంచి నటిని కూడా! నా నటనను నిరూపించుకునేందుకు ఒక్క మంచి ఛాన్స్ (Give Me Probability To Act) ఇవ్వండి. అలాంటి ఆఫర్ రాకపోవడం (Offer Me Good Roles) వల్లే ఇలా మీడియా ముందు నటించాల్సి వస్తోంది. అందరికీ మంచి పాత్రలు ఇచ్చినట్లే నాకూ ఇచ్చి చూడండని విజ్ఞప్తి చేసింది.