Adipurush: ఆది పురుష్ లో అభ్యంతరకర డైలాగులు, సీన్లు తొలగిస్తామని ప్రకటించిన రచయిత మనోజ్ శుక్లా
హిందీ డైలాగ్‌లు , పాటలను రాసిన శుక్లా, సవరించిన డైలాగులను ఈ వారంలోగా చిత్రానికి జోడిస్తామని తెలిపారు.
ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా ఆదివారం మాట్లాడుతూ, ప్రభాస్ నటించిన పౌరాణిక ఇతిహాస చిత్రంలో ఉపయోగించిన డైలాగులపై తీవ్ర విమర్శలు రావడంతో, "కొన్ని డైలాగ్‌లను సవరించాలని" నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హిందీ డైలాగ్‌లు , పాటలను రాసిన శుక్లా, సవరించిన డైలాగులను ఈ వారంలోగా చిత్రానికి జోడిస్తామని తెలిపారు.
"నాకు మీ భావాల కంటే గొప్పది ఏదీ లేదు. నా డైలాగులకు అనుకూలంగా నేను లెక్కలేనన్ని వాదనలు ఇవ్వగలను, కానీ ఇది మీ బాధను తగ్గించదు. నేను చిత్ర నిర్మాత దర్శకులు కొన్నింటిని సవరించాలని నిర్ణయించుకున్నాము. మిమ్మల్ని బాధించే డైలాగులు తొలగించి ఈ వారంలో చిత్రాన్ని సవరిస్తామని " అని శుక్లా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం దేశవ్యాప్తంగా హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన "ఆదిపురుష్"లో రాఘవ్ (రామ్)గా ప్రభాస్, జానకి (సీత)గా కృతి సనన్, లంకేష్ (రావణ్)గా సైఫ్ అలీఖాన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించి, టి-సిరీస్ నిర్మించారు,
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "ఆదిపురుష్" లో కొన్ని డైలాగ్‌లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. 'లంకా దహనం' సీన్స్‌లో హనుమాన్ డైలాగ్‌లపై భక్తులు ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన 'ఆదిపురుష్' శుక్రవారం విడుదలైన మొదటి రోజే రూ.140 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ పేర్కొన్నారు.