Adipurush Teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే! గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఆదిపురుష్ ట్రైలర్, శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ అదుర్స్, విజువల్ వండర్ తెరకెక్కిన మూవీ, లంకేష్ గా భయపెడుతున్న సైఫ్, వచ్చే ఏడాది సంక్రాంత్రికి రిలీజ్
నీళ్లలో తపస్సు చేస్తూ కనిపించిన సన్నివేశం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా ఉంది. దర్శకుడు ఓంరౌత్ (Om Raut) ముందు నుంచీ చెబుతున్నట్టే ఈ సినిమా విజులవ్ వండర్‌గా ఉండనుందని టీజర్ స్పష్టం చేసింది.
Ayodhya, OCT 02: ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది ! రెబల్‌స్టార్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఆదిపురుష్ (Adipurush Teaser) సినిమా టీజర్ రిలీజైంది. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ను అయోధ్య (Ayodhya) వేదికగా ఆదివారం సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. పదివేల మంది ఫ్యాన్స్ సమక్షంలో ప్రభాస్ తో పాటూ మూవీ టీం మొత్తం ఈవెంట్ కు హాజరయ్యారు. 1:46 నిమిషాల నిడివి గల ఈ టీజర్ (Adipurush Teaser) ఆడియన్స్‌కు కొత్త అనుభూతి కలిగిస్తుంది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో (Graffics) ఉన్న ఈ వీడియోను చూస్తుంటే.. సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. రామాయణం ఇతివృత్తంగా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ను అయోధ్య వేదికగా చిత్ర బృందం సాయంత్రం విడుదల చేసింది.
రాముడి లుక్‌లో (Sriram Look) ప్రభాస్ ఒదిగిపోయారు. నీళ్లలో తపస్సు చేస్తూ కనిపించిన సన్నివేశం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా ఉంది. దర్శకుడు ఓంరౌత్ (Om Raut) ముందు నుంచీ చెబుతున్నట్టే ఈ సినిమా విజులవ్ వండర్‌గా ఉండనుందని టీజర్ స్పష్టం చేసింది. (Adipurush Teaser) లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్, సీతగా కృతి సనన్ (Krithi sanon), హనుమంతుడిగా దేవదత్త నాగే (Devadatha nage), లక్ష్మణుడిగా సన్నీసింగ్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలతో కట్టిపడేసేలా ఉన్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకానుంది.