Sanjay Leela Bhansali Coronavirus: బాలీవుడ్‌ని వెంటాడుతున్న కరోనా భయం, తాజాగా రణబీర్ కపూర్, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్, స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన నటి ఆలియా భట్‌

ఇప్పటికే పలువురు నటులు కరోనాకు గురై ఆస్పత్రి పాలవగా.. తాజాగా నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ వార్త వచ్చిన కొద్ది నిమిషాల్లోనే దర్శకుడు, నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీకి (Sanjay Leela Bhansali Coronavirus) కూడా కరోనా పాజిటివ్‌గా నివేదికలు వచ్చాయి.ఈ నేపథ్యంలో మరో నటి ఆలియా భట్‌ ముందస్తుగా క్వారంటైన్‌లో ఉండిపోయారు.

Sanjay Leela Bhansali (Photo Credits: Twitter)

బాలీవుడ్‌క్‌ కరోనా వైరస్‌ భయం పట్టుకున్నది. ఇప్పటికే పలువురు నటులు కరోనాకు గురై ఆస్పత్రి పాలవగా.. తాజాగా నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ వార్త వచ్చిన కొద్ది నిమిషాల్లోనే దర్శకుడు, నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీకి (Sanjay Leela Bhansali Coronavirus) కూడా కరోనా పాజిటివ్‌గా నివేదికలు వచ్చాయి.ఈ నేపథ్యంలో మరో నటి ఆలియా భట్‌ ముందస్తుగా క్వారంటైన్‌లో ఉండిపోయారు.

చాక్లెట్ బాయ్ ర‌ణ్‌బీర్ కపూర్‌కు క‌రోనా పాజిటివ్ (Ranbir Kapoor COVID) వచ్చిన విషయాన్ని అత‌డి త‌ల్లి నీతూ కపూర్ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియ‌జేశారు. కరోనా వల్ల రణబీర్ కపూర్ మందులు తీసుకుంటూ కోలుకుంటున్నాడు...రణబీర్ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నాడు’’ అని నీతూ కపూర్ పోస్టు చేశారు. రణబీర్ కపూర్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర చిత్రంలో కనిపించారు. ‘బ్రహ్మాస్త్రా’ లో అలియా భ‌ట్, నాగార్జున కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కరోనాతో ప్రముఖ గాయకుడు, నటుడు కన్నుమూత, పంజాబ్ పాప్ సింగర్ శార్దుల్‌ సికందర్‌ మరణం తీరని లోటని తెలిపిన పంజాబ్ ముఖ్యమంత్రి, రోడ్‌వేస్ ది లారీ పేరిట‌ మొద‌టి ఆల్బ‌మ్‌ను విడుదల చేసిన శార్దూల్

ఇలాఉండగా, దర్శక నిర్మాత అయిన సంజయ్‌లీలా భన్సాలీకి కూడా కరోనా పాజిటీవ్‌గా తేలిందంట. భన్సాలికి కరోనా పాజిటివ్‌గా నివేదిక రావడంతో ముందస్తు జాగ్రత్తగా భన్సాలీ సినిమా ‘గంగూబాయి కథియావాడి’లో నటిస్తున్న అలియాభట్‌ (Alia Bhatt) కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నది. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకి కరోనా రావడంతో ‘గంగూబాయి కథియావాడి’ సినిమా నిర్మాణం పనులు నిలిచిపోయాయి. అయితే అధికారికంగా మాత్రం వెల్లడించలేదు.

ఇలాఉండగా, భన్సాలీ తల్లి లీలా భన్సాలీ మాత్రం ఆరోగ్యంగానే ఉన్నట్లు వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి. తనకు కొవిడ్‌-19 పరీక్షల్లో పాజిటివ్‌ రాగానే వెంటనే తన తల్లికి కూడా పరీక్షలు చేయించగా.. ఆమెకు నెగెటివ్‌గా తేలిందని, అయితే, ముందస్తుగా ఆమె కూడా క్వారంటైన్‌లో ఉండాలని నిశ్చయించుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.



సంబంధిత వార్తలు

Year Ender 2024: దేశంలో ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా, అల్లు అర్జున్ ఎంత ట్యాక్స్ కట్టాడో తెలుసుకోండి, పూర్తి వివరాలు ఇవిగో..

Missing Virus Vials: క్వీన్స్‌లాండ్ ల్యాబ్ నుంచి లీకైన వందలాది వైరస్‌లు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి, వీటిల్లో హెండ్రా వైరస్ చాలా డేంజరస్..

Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే ఐపీఎల్ మెగా వేలంలోకి, వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్‌ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి