Shatrughan Sinha, AI Photo of Saif Ali Khan, Kareena Kapoor (Photo Credit: X)

Kolkata, JAN 19: బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) దాడికి సంబంధించి సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా సీనియ‌ర్ న‌టుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) కూడా ఈ ఘ‌ట‌న‌పై ఎక్స్ వేదిక‌గా స్పందిస్తూ సైఫ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించాడు. అయితే ఈ పోస్ట్‌కి ఆయ‌న ఆసుప‌త్రిలో న‌వ్వుకుంటూ ఉన్న‌ సైఫ్ అలీఖాన్, కరీనా క‌పూర్ ఏఐ ఫొటోల‌ను జ‌త చేశాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డంతో తాజాగా డిలీట్ చేశాడు.

Shatrughan Sinha Shares ‘Smiling’ AI-Generated Photo of Saif Ali

 

నాకు చాలా ఇష్ట‌మైన వ్య‌క్తి సైఫ్ అలీఖాన్‌పై దాడి జ‌ర‌గ‌డం చాలా దురదృష్టకరం. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ దాడి జ‌రిపిన వారిపై ప్ర‌భుత్వం కూడా వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటుంది. ప‌రిస్థితులు త్వ‌ర‌లోనే చ‌క్క‌బ‌డ‌తాయి అంటూ శత్రుఘ్న సిన్హా తెలిపాడు. అయితే దీనికి ఆయ‌న పోస్ట్ చేసిన ఫొటో ఇప్పుడు వివాదాస్పందంగా మారింది.