Allu Arjun At Balakrishna Unstoppable Show: బాల‌య్య షోలో మ‌రోసారి పుష్ప‌రాజ్, ఈ సారి ఈ ఇద్ద‌రి ర‌చ్చ మామూలుగా లేదుగా! అన్ స్టాప‌బుల్ షోలో ఐకాన్ స్టార్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

ఇక ఇద్దరూ కలిసి పుష్ప స్టెప్ వేసి సందడి చేసారు. ఈ గ్లింప్స్ విడిగా రిలిజ్ చేయకపోయినా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఆహా కూడా ఈ సర్ ప్రైజ్ ని అధికారికంగా ప్రకటించింది.

Allu Arjun At Balakrishna

Hyderabad, NOV 09: ఆహా ఓటీటీలో బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 (Unstoppable-4) కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ రాగా తాజాగా నిన్నటి నుంచి మూడవ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ కి సూర్యతో పాటు బాబీ డియోల్, డైరెక్టర్ శివ వచ్చి సందడి చేసారు. అయితే ఈ ఎపిసోడ్ మొదట్లోనే బన్నీ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. అల్లు అర్జున్ మరోసారి అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన గ్లింప్స్ ని సూర్య ఎపిసోడ్ ముందు ప్లే చేసారు. అ అర్జున్ రాగానే బాలయ్య మన ఇద్దరం రిలేటివ్స్ అనగా ఎలా అని బన్నీ (Bunny) అడిగితే నేను కృష్ణుడు, నువ్వు అర్జునుడు అని చెప్పారు బాలయ్య. ఇక ఇద్దరూ కలిసి పుష్ప స్టెప్ వేసి సందడి చేసారు. ఈ గ్లింప్స్ విడిగా రిలిజ్ చేయకపోయినా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఆహా కూడా ఈ సర్ ప్రైజ్ ని అధికారికంగా ప్రకటించింది.

Allu Arjun At Balakrishna Unstoppable Show

 

గతంలో పుష్ప సినిమా ప్రమోషన్స్ టైంలో అల్లు అర్జున్ (Allu Arjun) బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసాడు. ఇప్పుడు మరోసారి పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అన్‌స్టాపబుల్ షోకి వచ్చినట్టు తెలుస్తుంది.

Allu Arjun At Balakrishna Unstoppable Show

 

ఇప్పటికే అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ షూట్ అవ్వగా ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేయడంతో ఈ ఎపిసోడ్ నెక్స్ట్ నాలుగవ ఎపిసోడ్ గా రిలీజ్ చేస్తారా లేదా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బాలయ్య – అల్లు అర్జున్ చేసే అల్లరి కోసం ఫ్యాన్స్ మరోసారి వెయిట్ చేస్తున్నారు.



సంబంధిత వార్తలు