ButtaBomma Video Song: హృదయాల్లో గిటార్ వాయిస్తున్న బుట్టబొమ్మ! అల్లు అర్జున్- పూజ హెగ్డేల అందమైన కెమిస్ట్రీ, అద్భుతమైన డాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంటున్న సాంగ్ వీడియో

ఈ చిత్రంలో, అల్లు అర్జున్ ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చెబుతున్నారు....

Butta Bomma Video Song Promo | Photo: Aditya Music

అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే జంటగా వచ్చిన  'అల వైకుంఠపురములో'  ( #AlaVaikunthapurramuloo ) సంక్రాతి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని మ్యూజిక్ కూడా సూపర్ హిట్.  రాములో.. రాములా, సామజవరగమన ,  బుట బొమ్మ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి.  ఇందులోని బుట్టబొమ్మ ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇక ఈ పాట గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) ఒక సన్నివేశంలో విలన్‌తో ఇచ్చే 'శ్‌శ్‌‌శ్‌శ్‌ల్ ‌..ప్' అనే ఎక్స్‌ప్రెషన్ లాగా కసక్ ఉంది. మరోసారి స్టైలిష్ స్టార్ యొక్క క్రేజీ డ్యాన్స్ మూవ్స్ మరియు పూజా హెగ్డే (Pooja Hegde) తో అతని అందమైన కెమిస్ట్రీ మనల్ని ఒక మాయలోకి నెట్టేస్తుంది.  ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాటకు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, థమన్. ఎస్ స్వరపరిచారు. ఈ పాట వింటుంటే, మనస్సు హాయిగా తాకుతూ గుండెల్లో గిటార్ ప్లే చేస్తున్నట్లుగా ఉంది.

ఇప్పటికే టిక్ టాక్ లాంటి సోషల్ మీడియాలో క్రేజీగా ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్, ఒరిజినల్ ఫుల్ వీడియో చూసేయండి.

ButtaBomma Full Video Song:

ఇక సినిమా కథ విషయానికి వస్తే, 'అల వైకుంఠపురములో' అన్ని ఎలిమెంట్స్ బాగా కుదిరిన ఒక మంచి కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. గొప్పింట్లో పెరగాల్సిన ఒక అబ్బాయి, దేనికి నోచుకొని మిడిల్ క్లాస్ ఇంట్లో, అలాగే మిడిల్ క్లాస్ ఇంట్లో పెరగాల్సిన అబ్బాయి రాజకుమారిడి భోగాలతో గొప్పింట్లో పెరిగితే ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే ఆసక్తికరమైన కాన్సెప్టుతో, ఆసక్తికరమైన కథనంతో సినిమా కథ సాగుతుంది. యాక్షన్, కామెడీ డాన్స్ లలో అల్లు అర్జున్ మార్క్ స్టైల్ కనిపిస్తుంది. సుశాంత్ ది అల్లు అర్జున్ కు సమానమైన క్యారెక్టర్ అయినప్పటికీ, అతడి క్యారెక్టర్ పై హీరో క్యారెక్టర్ పూర్తిగా డామినేట్ చేస్తుంది. ఇక సినిమాలో విలన్ ఉన్నప్పటికీ అతడి పరిధి కొంతవరకే ఉంటుంది. ఆసుపత్రిలో పిల్లలను మార్చి తన కొడుకును గొప్పింట్లో, వారి కొడుకును (అల్లు అర్జున్) ను తన ఇంట్లో పెంచుకొని సాడిజం చూపించే తండ్రి పాత్రనే టెక్నికల్ గా విలన్ అని చెప్పవచ్చు, ఇతడి క్యారెక్టర్ కథను ఆసక్తికరంగా నడిపిస్తుంది.

హీరో క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో మిగతా క్యారెక్టర్స్ చిన్నగా అనిపిస్తాయి. పూజా హెగ్డే గ్లామర్, సీనియర్ నటి టబు స్క్రీన్ ప్రెసెన్స్, థమన్ మ్యూజిక్, అల్లు అర్జున్ డాన్స్ మరియు ఫైట్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ సినిమా సంక్రాంతి హిట్ గా నిలిచింది.



సంబంధిత వార్తలు