Allu Studios Opening: కొత్త బిజినెస్‌లోకి అల్లు అర్జున్, తాతయ్య పేరుతో అల్లు స్డూడియోస్, 10 ఎకరాల్లో కాస్ట్ లీ స్టూడియో, కోకాపేటలో సరికొత్త హంగులతో ఏర్పాటు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం

ఈ కార్యక్రమంకు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య గారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ స్టూడియో నిర్మాణంతో హైదరాబాద్ లో సినిమా, టీవీ షూటింగ్స్ కి మరో స్టూడియో అందుబాటులోకి వచ్చింది.

Credit @Geetha arts Twitter

Hyderabad, OCT 01: పుష్పతో (Pushpa) పాన్ ఇండియా స్టార్‌ గా ఎదిగిన అల్లు అర్జున్ (AlluArjun)...సరికొత్త బిజినెస్‌ లోకి ఎంటరయ్యారు. తన తాత అల్లు రామలింగయ్య (Allu ramalingaiah) శత జయంతి సందర్భంగా ఆయన పేరుతో స్టూడియో ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి (Mega star chiranjeevi) చేతుల మీదుగా ఈ స్టూడియో ప్రారంభమైంది. తెలుగు సినిమాల్లో స్టార్ కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొంది తన జీవితాన్ని సినీ పరిశ్రమకి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అల్లు రామలింగయ్య. అల్లు రామలింగయ్య గారి తనయుడిగా అల్లు అరవింద్ (Allu aravind) స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. అయన మనవడు అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఫిల్మ్ ప్రొడక్షన్ లో అపార అనుభవం ఉన్న అరవింద్...స్డూడియో నిర్మించే పనుల్లో కొద్దిరోజులుగా బిజీగా ఉన్నారు.

అల్లు ఫ్యామిలీ (Allu family) గత కొన్ని రోజులుగా అల్లు స్టూడియోస్ నిర్మాణం చేపట్టింది. కోకాపేటలో (Kokapeta) అల్లు స్టూడియోస్ ని (Allu Studios) నిర్మిస్తున్నారు. మొత్తం 10ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే ఒక స్టూడియో ఫ్లోర్ పూర్తి అయింది. మరో స్టూడియో ఫ్లోర్ నిర్మాణంలో ఉంది. ముఖ్యంగా ఇండోర్ సినిమా షూటింగ్స్ కోసం ఈ స్టూడియోని నిర్మిస్తున్నారు. భవిష్యత్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు అల్లు ఫ్యామిలీ.

Harihara Veeramallu: 'హరిహర వీరమల్లు' వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో! 

కోకాపేటలో నూతనంగా కట్టిన ఈ అల్లుస్టూడియోస్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య గారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ స్టూడియో నిర్మాణంతో హైదరాబాద్ లో సినిమా, టీవీ షూటింగ్స్ కి మరో స్టూడియో అందుబాటులోకి వచ్చింది.