Balagam Mogilaiah Health Update: బలగం సింగర్ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత, చెడిపోయిన రెండు కిడ్నీలు, హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు, ప్రభుత్వం ఆదుకోవాలంటూ భార్య వినతి

సినిమాలో తన గాత్రంతో, బుర్రకథలతో ప్రజలను మెప్పించిన మొగిలయ్య ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Balagam Mogulaiah (Photo-Video Grab)

బలగం చిత్రం ద్వారా ఫేమస్‌ అయిన పాస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సినిమాలో తన గాత్రంతో, బుర్రకథలతో ప్రజలను మెప్పించిన మొగిలయ్య ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రభాస్‌ మూవీ నుంచి స్పెషల్ అప్‌డేట్! హనుమాన్‌ జయంతి స్పెషల్ పోస్టర్ రిలీజ్‌ చేసిన ఆదిపురుష్ టీం

గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో వారానికి మూడుసార్లు ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నారు. కాగా.. తన భర్తకు వైద్య సాయం అందించి.. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఉత్తమ దర్శకుడిగా బలగం డైరక్టర్ వేణుకి అంతర్జాతీయ అవార్డు, ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులు కైవసం చేసుకున్న బలగం మూవీ

బలగం మూవీ క్లైమాక్స్‌లో మానవ సంబంధాను వివరిస్తూ ఆయన చేసిన గానం ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశమే సినిమాకు హైలెట్‌గా నిలిచింది. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బుర్ర కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif