Bappi Lahiri Dies: బప్పి లహరి కన్నుమూత, బాలీవుడ్‌కు డిస్కో పరిచయం చేసిన బప్పి, ఆయన ఆహార్యం, మ్యూజిక్ స్టైల్ డిఫరెంట్
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. దీంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. 1980, 90 దశకాల్లో బప్పి లహరి మ్యూజిక్ కు (Bappi Lahiri Music) చాలా క్రేజ్ ఉండేది.
Mumbai, Feb 16: ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ బప్పి లహరి(Bappi Lahiri) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. దీంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. 1980, 90 దశకాల్లో బప్పి లహరి మ్యూజిక్ కు(Bappi Lahiri Music) చాలా క్రేజ్ ఉండేది. ఎప్పుడూ ఒంటినిండా బంగారంలో కనిపించడం బప్పి స్టైల్. తన డిస్కో(Disco) మ్యూజిక్‌తో భారతీయ సినీపరిశ్రమను ఆయన ఒక ఊపుఊపేశారు. బప్పి సంగీత దర్శకత్వం వహించిన చల్తే చల్తే(Chalte Chalte), డిస్కో డ్యాన్సర్()Disco Dancer), షరాబీ(Sharaabi) వంటి పలుచిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. బప్పి లహరి 1952, నవంబర్ 27న బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో జన్మించారు. ఆయన హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ భాషల్లో సంగీతం అందించారు. 2014లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. అదేఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బెంగాల్ నుంచి ఎంపీగా పోటీచేశారు.
బప్పి లహరి తెలుగులో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. సింహాసనం, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీగారిపెళ్లాం, దొంగ పోలీసు, బ్రహ్మ, నిప్పురవ్వ, బిగ్‌బాస్(Big Boss), ఖైదీ ఇన్‌స్పెక్టర్ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన మ్యూజిక్ అందిచారు. తెలుగులో ఇటీవల డిస్కోరాజా చిత్రంలో కూడా పాటపడారు. కాగా, హిందీలో 2020లో విడుదలైన బాఘీ 3(Baaghi 3) సినిమాలో తన చివరి పాట పాడారు. బప్పి లహరి మరణంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.