Singer Kalpana's Health Update

Hyd, Mar 5: టాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయని కల్పన (Singer Kalpana) నిన్న నిద్రమాత్రలు మింగిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం (Health) నిలకడగా ఉందని కూకట్‌పల్లి హోలిస్టిక్‌ ఆస్పత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. గాయని కల్పన నిద్రమాత్రలు (Sleeping Pills) మింగిందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌ (Ventilator)పై చికిత్స అందిస్తున్నామన్నారు. ఆమెకు ఇన్ఫెక్షన్‌ ఉండటం వల్ల ఆక్సిజన్‌ అందిస్తున్నామని, ప్రస్తుతం సింగర్‌ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ చైతన్య (Dr. Chaitanya) తెలిపారు.

నిన్న సాయంత్రం 5:30 గంటలకు ఆపస్మారక స్థితిలో ఉన్న సింగర్ కల్పనను హాస్పిటల్‌కు తీసుకు వచ్చారని డాక్టర్ తెలిపారు. నిద్ర మాత్రలు ఎక్కువ తీసుకున్నారని.. మాత్రల డోస్ ఎక్కువ అవ్వడంతో.. స్టమక్ వాష్ చేసామని.. బ్రీతింగ్ సమస్యలకు పరీక్షలు చేసి.. పలమనరి సమస్యకు చికిత్స అందించామని తెలిపారు. ప్రస్తుతం కల్పన ఆక్సిజన్‌పై ఉన్నారని.. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చైతన్య తెలిపారు.

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా వార్తలు, నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో వెళ్లిన టాలీవుడ్ సింగర్

సింగర్ కల్పన కేసులో కేపీహెచ్‌బీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ‘Zolfresh’ ఆమె నిద్ర మాత్రలు వేసుకున్నారు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. కాగా బుధవారం కల్పన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. హైదరాబాదులో సింగింగ్‌తో పాటు లా కూడా చేస్తున్నారు. తన పెద్ద కూతురును హైదరాబాదుకు రావాలని కల్పన కోరారని అయితే తాను హైదరాబాదుకురానని కేరళలోని ఉంటానని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరి మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

Singer Kalpana's Health Update

దీంతో ఆమె నిద్రమాత్రలు మోతాదుకన్నా ఎక్కువ తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సాయంత్రం 4:30 గంటలకు కల్పనకు భర్త ప్రసాద్ ఫోన్ చేశారు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విల్లా సెక్రటరీకి కాల్ చేశారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కల్పనను హాస్పటల్‌కు తరలించారు