Chiranjeevi New Look: లీకయిన చిరంజీవి కొత్త సినిమా లుక్, ఎర్రకండువాతో దుమ్మురేపుతోన్న మెగాస్టార్, కొరటాల సినిమా కోసం బరువు తగ్గిన చిరంజీవి

చిరంజీవి న‌టిస్తోన్న 152వ చిత్ర‌మిది. దేవాదాయ శాఖ‌లో జ‌రిగే అవినీతి అక్ర‌మాల‌పై ఈ సినిమా ఉంటుంద‌ని, న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన మెగాస్టార్ చిరంజీవి లుక్ ఒక‌టి నెట్టింట్లో లీకైంది. ఈ లుక్‌లో ఎర్ర‌టి కండువాతో చిరంజీవి ఆక‌ట్టుకుంటున్నాడు.

chiranjeevi-new-look-leaked-from-koratala-siva-movie-and-it-goes-viral-in-social-media (Photo-Social media)

Hyderabad, Febuary 23: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్ర‌స్తుతం కొర‌టాల (Koratala siva) ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి న‌టిస్తోన్న 152వ చిత్ర‌మిది. దేవాదాయ శాఖ‌లో జ‌రిగే అవినీతి అక్ర‌మాల‌పై ఈ సినిమా ఉంటుంద‌ని, న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన మెగాస్టార్ చిరంజీవి లుక్ ఒక‌టి నెట్టింట్లో లీకైంది. ఈ లుక్‌లో ఎర్ర‌టి కండువాతో చిరంజీవి ఆక‌ట్టుకుంటున్నాడు.

సైరా కోసం అప్పట్లో కాస్త బరువు పెరిగినట్లు కనిపించిన చిరు.. ఇప్పుడు మళ్లీ కొరటాల కోసం బరువు తగ్గిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. రంగస్థలం షూటింగ్ చేసిన సెట్లోనే ఈ చిత్రం కోసం భారీ సెట్ వేసారు. అక్కడే 50 రోజుల షెడ్యూల్ దర్శకుడు కొరటాల ప్లాన్ చేసాడు .

రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఏప్రిల్ నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇదే ఏడాది దసరా కానుకగా చిరంజీవి సినిమా విడుదల కానుంది. దీనికి ఆచార్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. ఏదేమైనా చిరంజీవి లుక్ ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) వైరల్ అయిపోతుంది.



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Ambati Rambabu Fire on Kutami: టీడీపీకి ఒక చ‌ట్టం, వైసీపీకి ఒక చ‌ట్ట‌మా? మాపై ట్రోలింగ్ చేసిన వారిపై కేసులుండ‌వా? అని ప్ర‌శ్నించిన అంబ‌టి రాంబాబు

Pushpa 2: The Rule: 80 దేశాల్లో ఆరు భాషల్లో పుష్ప 2 విడుదల, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు, ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పగాడు