Coronavirus in Tollywood: టాలీవుడ్‌లో కరోనా కలకలం, హీరోయిన్‌ నివేదా థామస్‌‌కు కరోనా పాజిటివ్, ట్విట్టర్ ద్వారా తెలిపిన ముద్దుగమ్మ

ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘అందరికి నమస్తే.. నేను కరోనా పాజిటివ్‌గా పరీక్షించాను. డాక్టర్‌ సలహాతో అన్ని విధాల మెడికల్‌ ప్రోటోకాల్‌ పాటిస్తూ ఐసోలేషన్‌కు వెళ్లాను. ఇటీవల నన్ను కలిసి వారంత దయచేసి హోం క్వారంటైన్‌కు వెళ్లండి.

Nivetha Thomas (Photo-Twitter)

చిత్ర సీమను కరోనావైరస్ వణికిస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ లో కరోనా కలకలం (Coronavirus in Tollywood) రేగింది. ప్రముఖ‌ నిర్మాత అల్లు అరవింద్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లు కరోనా పాజటివ్‌గా పరీక్షించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటికి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌లు డాక్టర్ల సలహా మేరకు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని, కరోనా నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా హీరోయిన్‌ నివేదా థామస్‌ (Nivetha Thomas) సైతం తాజాగా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

Here's Nivetha Thomas Tweet

ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘అందరికి నమస్తే.. నేను కరోనా పాజిటివ్‌గా పరీక్షించాను. డాక్టర్‌ సలహాతో అన్ని విధాల మెడికల్‌ ప్రోటోకాల్‌ పాటిస్తూ ఐసోలేషన్‌కు వెళ్లాను. ఇటీవల నన్ను కలిసి వారంత దయచేసి హోం క్వారంటైన్‌కు వెళ్లండి. ఈ కష్టకాలంలో నాకు సపోర్టుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నా మెడికల్‌ టీంకు. నాపై ప్రత్యేక శ్రద్ధా చూపిస్తున్నా వారికి నిజంగా రుణపడి ఉంటాను’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.



సంబంధిత వార్తలు

Tollywood Film Industry: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి