Non-Bailable Arrest Warrant to Actor Prithviraj: ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఫేమస్ నటుడు పృథ్వీ రాజ్ కు కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ.. ఎందుకంటే??
‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’, బాయిలింగ్ స్టార్ బబ్లూ ఇలా పలు క్యారెక్టర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్ కు అనుకోని షాక్ తగిలింది.
Vijayawada, June 13: ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’, బాయిలింగ్ స్టార్ బబ్లూ ఇలా పలు క్యారెక్టర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్ (Actor Prithviraj) కు అనుకోని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు (Family Court) అతడికి బుధవారం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. పృథ్వీకి, ఆయన భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి మధ్య గత కొంతకాలంగా విబేధాలు ఉన్నాయి. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా.. శ్రీలక్ష్మికి నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను పాటించని పృథ్వీ.. ఈ కేసును హైకోర్టులో సవాలు చేశారు.
తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా..
కేసును పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం పృథ్వీకి తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. అయితే, పృథ్వీ రాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులతో తిరిగి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి బుధవారం పృథ్వీ రాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటు జారీ చేశారు.
మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందా? అయితే, మీ గుండెకు హాని జరుగొచ్చు.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే!