Kathi Mahesh Arrested: కత్తి మహేష్‌కి 14 రోజుల రిమాండ్, శ్రీరాముడుపై అనుచిత పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేసిన సైబైర్ క్రైమ్ పోలీసులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు

సోషల్‌ మీడియాలో శ్రీరాముడిపై (Lord Sriram)అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకుగాను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అనంతరం నాంపల్లి కోర్టులో (Nampally court) హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఐపీఎస్‌ సెక్షన్‌ 153(ఎ​) కమ్యూనల్‌ యాక్ట్‌ కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Kathi Mahesh (Photo Credit: IANS)

Hyderabad, August 14: టాలీవుడ్‌ వివాదాస్పద సినీ విశ్లేషకుడు‌ కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ (Kathi Mahesh Arrested) చేశారు. సోషల్‌ మీడియాలో శ్రీరాముడిపై (Lord Sriram)అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకుగాను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అనంతరం నాంపల్లి కోర్టులో (Nampally court) హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఐపీఎస్‌ సెక్షన్‌ 153(ఎ​) కమ్యూనల్‌ యాక్ట్‌ కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్, ట్విటర్‌లో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అసభ్యకర పోస్ట్‌లు పెట్టారు. తన ఫేస్ బుక్‌లో ‘రాముడు కరోనా ప్రియుడు’ అంటూ పోస్ట్ పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హిందూ సంఘాలు పలు చోట్ల కేసులు పెట్టాయి.

వారి ఫిర్యాదుల ఆధారంగా సైబైర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పలుమార్లు కత్తి మహేష్‌ను విచారించారు. ఇవాళ మరోసారి విచారించిన పోలీసులు.. విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. కాగా, కొన్నేళ్లుగా కొత్తి మహేష్ వార్తల్లో ఉంటున్నారు. గ తంలోనూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌ నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే.గతంలో పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. అలా పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ మధ్య కొన్ని నెలల పాటు మాటల యుద్ధం జరిగింది. ఆయనపై హైదరాబాద్‌లో ఓసారి దాడి కూడా జరిగింది.

సినీ క్రిటిక్ కత్తి మహేష్ హృదయ కాలేయం, నేనే రాజు నేనే మంత్రి, కొబ్బరి మట్టతో పాటు పలు సినిమాల్లో నటించారు. అంతేకాదు పెసరట్టు సినిమా డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో పాల్గొన్నారు. ఇటీవల ఆర్జీవీ డైరెక్ట్ చేసిన పవర్ స్టార్ సినిమాల్లోనూ నటించారు.



సంబంధిత వార్తలు