Ayudha Pooja Song: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే! ఎన్నోరోజులుగా వెయిట్ చేస్తున్న ఆయుధ పూజ సాంగ్ వచ్చేసింది (వీడియో ఇదుగో)
నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి
Hyderabad, SEP 26: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర (Devara). నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఆయుధ పూజ సాంగ్‌ను (Ayudha Pooja Song) మేకర్స్ రిలీజ్ చేశారు.
Here's the Song
”ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు రణధీరుల పండగ నేడు. కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు మన జట్టుగ ఆడెను చూడు. హే ఉప్పూగాలే నిప్పుల్లో సెగలెత్తే హే డప్పూమోతలు దిక్కుల్లో ఎలుగెత్తే పులిబిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తే పోరుగడ్డే అట్టా శిరసెత్తి శివమెత్తె.” అంటూ ఫుల్ మాస్ బీట్‌తో సాగిన ఈ పాట అభిమానులకు పండగ అని చెప్పుకోవాలి. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. కాలా భైరవ పాడాడు. అనిరుధ్ సంగీతం అందించాడు.