Dil Raju: ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ గెలుపు, ప్రొడ్యూసర్ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్ గెలుపు..
ప్రొడ్యూసర్ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్ గెలుపొందింది.
ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ గెలుపు సాధించింది. ప్రొడ్యూసర్ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్ గెలుపొందింది. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో రెండు ప్యానల్స్ నుంచి చెరో ఆరుగురు గెలుపొందారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కూడా దిల్‌రాజుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. స్టూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్ సభ్యులు ఉండటం విశేషం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు, సి.కల్యాణ్ ప్యానెళ్లు పోటీ పడ్డాయి. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి మొత్తం 1567 ఓట్లకు గానూ పోలైన ఓట్లు-810గా ఉన్నాయి. ప్రొడ్యూసర్ల సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్ గెలుపు సాధించింది. దిల్ రాజు పానెల్ లోని స్రవంతి రవికిషోర్, రవిశంకర్ యలమంచలి, దిల్ రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లాపాటి, పద్మిని గెలుపొందారు.