RGV Tweet on Rana Naidu: రానా నాయుడు ఇండియాలో దుమ్ము రేపిందిగా, నంబర్ వన్ షోగా ట్రెండింగ్‌లో వెబ్ సిరీస్, వర్మకు థ్యాంక్స్ చెబుతూ నెటిజన్లకు సారి చెప్పిన రానా

సుప్రన్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండ్ అవుతోంది. మార్చి 10న విడుదలైన ఈ సీరిస్ రెండు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లోకి చేరింది

Rana Naidu (photo-Twitter)

దగ్గుబాటి వెంకటేశ్‌ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). సుప్రన్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండ్ అవుతోంది. మార్చి 10న విడుదలైన ఈ సీరిస్ రెండు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లోకి చేరింది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ తెలియజేసింది.

భారత్‌ టాప్‌ ట్రెండింగ్‌ షోల్లో ‘రానా నాయుడు’ ప్రథమ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ షేర్ చేసారు. వెంకటేష్,రానాలకు కంగ్రాట్స్ చెప్పారు. రామానాయుడుగారి కీర్తి పతాకాన్ని కొడుకు, మనవడు కలిసి ఎగరవేస్తున్నారని, అభినందనలు తెలియచేసారు.

ఇక ఈ సిరీస్‌లో శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉందని పలువురు నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు సమీర్ ఖాఖర్ కన్నుమూత, మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా తిరిగిరాని లోకాలకు

ఈ క్రమంలో రానా (Rana) వాళ్లందరికీ సారీ చెప్పారు. అలాగే, ఈ సిరీస్‌ను కుటుంబంతో కాకుండా ప్రతి ఒక్కరూ ఒంటరిగా చూడాలని మరోసారి స్పష్టం చేశారు.‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ ప్రీమియర్‌ రోజున వెంకటేష్‌ మాట్లాడుతూ తన కెరీర్‌లో ఇప్పటిదాకా చేయని ఓ భిన్నమైన ప్రయత్నమిదని, దీంట్లో హింస, శృంగార సన్నివేశాలు ఉంటాయని చెబుతూ…సారీ చెప్పాడు.

Here's RGV Tweet

అమెరికన్‌ టీవీ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ‘రే డోనోవన్‌’ రీమేక్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించారు. రానా సెలబ్రిటీ ఫిక్సర్‌గా, వెంకటేష్‌ నేరస్తుడి పాత్రల్లో నటించారు. మూడు దశాబ్దాలుగా క్లీన్ ఫ్యామిలీ ఇమేజ్ మీద కెరీర్ ని లాగిస్తున్న వెంకటేష్ ఈ వెబ్ సిరీస్ చేశారు. రానా నాయుడు'లో వెంకటేష్ పాత్ర తెలుగు ఆడియన్స్ కు షాకింగ్ గానే ఉంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif