Filmfare Awards 2023 Winners: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2023 విన్నర్స్ లిస్ట్ ఇదిగో, ఉత్తమ నటిగా ఆలియా భట్‌, ఉత్తమ నటుడిగా రాజ్‌ కుమార్‌ రావు

జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్‌ (Bollywood) తారలు హాజరై సందడి చేశారు.

Stills from Badhaai Do, Gangubai Kathiawadi and Brahmastra (Photo Credits: Junglee Pictures, SLB Films and Dharma Productions)

68వ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2023’ ( 68th edition of Filmfare Awards) వేడుకలు గురువారం రాత్రి ముంబై (Mumbai)లో అట్టహాసంగా జరిగాయి. జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్‌ (Bollywood) తారలు హాజరై సందడి చేశారు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, మనీశ్ పాల్ హోస్టులుగా వ్యవహరించారు. ఫిలింఫేర్‌ అవార్డుల్లో గంగూబాయి కథియావాడి సత్తా చాటింది. ఏకంగా 10 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాత బదాయి దో సినిమా ఆరు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.

వీడియో ఇదిగో, రజినీకాంత్‌ని కౌగిలించుకుని స్వాగతం పలికిన బాలకృష్ణ, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ విచ్చేసిన సూపర్ స్టార్

ఈ ఏడాది ఈ రెండు చిత్రాలకే ఎక్కువ అవార్డులు వరించాయి. ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా ఏకంగా 9 విభాగాల్లో ‘గంగూబాయి కఠియావాడి’ చిత్రం అవార్డులను సొంతం చేసుకోగా.. ఉత్తమ నటుడు సహా ఆరు కేటగిరీల్లో ‘బాదాయ్ దో’ సినిమా అవార్డులు గెలుచుకుంది. భాషతో సంబంధం లేకుండా బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1’లోని ‘కేసరియా’ పాటకు ఉత్తమ సాహిత్య, గాయకుడి అవార్డులు వరించాయి. ఉత్తమ నటిగా ఆలియా భట్‌, ఉత్తమ నటుడిగా రాజ్‌ కుమార్‌ రావు నిలిచారు. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న ది కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రానికి ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం.

అవార్డులు అందుకుంది వీరే..

► ఉత్తమ చిత్రం - గంగూబాయి కథియావాడి

► ఉత్తమ దర్శకుడు - సంజయ్‌ లీలా భన్సాలీ (గంగూబాయి కథియావాడి)

► ఉత్తమ చిత్రం(క్రిటిక్స్‌) - బదాయ్‌ దో (హర్షవర్ధన్‌ కులకర్ణి)

► ఉత్తమ నటి - ఆలియా భట్‌ (గంగూబాయి కథియావాడి)

► ఉత్తమ నటి (క్రిటిక్స్‌) - టబు (భూల్‌ భులాయా 2), భూమి పెడ్నేకర్‌ (బదాయి దో)

► ఉత్తమ నటుడు - రాజ్‌ కుమార్‌ రావు (బదాయి దో)

► ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) - సంజయ్‌ మిశ్రా (వధ్‌)

► ఉత్తమ సహాయ నటుడు - అనిల్‌ కపూర్‌ (జుగ్‌ జుగ్‌ జియో)

► ఉత్తమ సహాయ నటి -షీబా చద్దా (బదాయి దో)

► ఉత్తమ గీత రచయిత - అమితాబ్‌ భట్టాచార్య (బ్రహ్మాస్త్ర 1లోని కేసరియా పాట)

► ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌ - ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర 1)

► ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్జిత్‌ సింగ్‌ (బ్రహ్మాస్త్ర 1లోని కేసరియా పాట)

► ఉత్తమ నేపథ్య గాయని - కవిత సేత్‌ (జుగ్‌జుగ్‌ జియోలోని రంగిసారి.. పాట)

► ఉత్తమ కథ - అక్షత్‌ గిల్డయల్‌, సుమన్‌ అధికారి (బదాయి దో)

► ఉత్తమ స్క్రీన్‌ప్లే - అక్షత్‌ గిల్డయల్‌, సుమన్‌ అధికారి, హర్షవర్ధన్‌ కులకర్ణి (బదాయి దో)

► ఉత్తమ సంభాషణలు - ప్రకాశ్‌ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కథియావాడి)

► ఉత్తమ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ - సంచిత్‌ బల్హారా, అంకిత్‌ బల్హారా (గంగూబాయి కథియావాడి)

► ఉత్తమ సినిమాటోగ్రఫీ - సుదీప్‌ చటర్జీ (గంగూబాయి కథియావాడి)

► ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ - సుబ్రత చక్రవర్తి, అమిత్‌ రాయ్‌ (గంగూబాయి కథియావాడి)

► ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ - షీతల్‌ ఇక్బాల్‌ శర్మ (గంగూబాయి కథియావాడి)

► ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ - బిశ్వదీప్‌ దీపక్‌ చటర్జీ (బ్రహ్మాస్త్ర 1)

► ఉత్తమ ఎడిటింగ్‌ - నీనద్‌ కలంకార్‌ (ఎన్‌ యాక్షన్‌ హీరో)

► ఉత్తమ యాక్షన్‌ - పర్వేజ్‌ షైఖ్‌ (విక్రమ్‌ వేద)

► ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌ - డీఎన్‌ఈజీ, రెడిఫైన్‌ (బ్రహ్మాస్త్ర 1)

► ఉత్తమ కొరియోగ్రఫీ - కృతి మహేశ్‌ (డోలిడా- గంగూబాయ్‌ కథియావాడి)

► ఉత్తమ డెబ్యూ దర్శకుడు - జస్పల్‌ సింగ్‌ సంధు, రాజీవ్‌ బర్న్‌వల్‌ (వధ్‌)

► ఉత్తమ డెబ్యూ హీరో - అంకుశ్‌ గదం (ఝండ్‌)

► ఉత్తమ డెబ్యూ హీరోయిన్‌ - ఆండ్రియా కెవిచుసా (అనేక్‌)

► జీవిత సాఫల్య పురస్కారం - ప్రేమ్‌ చోప్రా

► ఆర్‌డీ బర్మన్‌ అవార్డ్‌ - జాన్వీ శ్రీమంకర్‌ (డోలిడా- గంగూబాయి కథియావాడి)

ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ తారలు ఆలియా భట్‌, జాన్వీ కపూర్, భూమి పడ్నేకర్, పూజా హెగ్డే, ఫాతిమా సనా ఖాన్, దియా మీర్జా, నర్గీస్ ఫక్రీ, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీలియోని, రేఖ, కాజోల్, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు తారలు ఇచ్చిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif