Guntur Kaaram Review: కుర్చీ మడతపెట్టి సాంగ్ కోసమైనా వెళ్లాల్సిందే, గుంటూరు కారం రివ్యూ ఇదిగో, త్రివిక్రం కలం ఘాటు తగ్గిందా, పెరిగిందా ఇక మీరే చెప్పండి

శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Guntur Kaaram Review

అతడు, ఖలేజా వంటి హిట్ సినిమాల తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. రివ్యూ ఎలా ఉందో ఓ సారి చూద్దాం..

సినిమా కథ: వైరా వ‌సుంధ‌ర (ర‌మ్య‌కృష్ణ‌), రాయ‌ల్ స‌త్యం (జ‌య‌రామ్‌) కొడుకు వీర వెంక‌ట ర‌మ‌ణ అలియాస్ ర‌మ‌ణ (మ‌హేశ్‌బాబు). జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్‌ రాజ్‌) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ). వ‌సుంధ‌ర మ‌రో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయ శాఖ మంత్రి అవుతుంది. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది.ఇక తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో కొడుకు వీర వెంక‌ట ర‌మ‌ణ అలియాస్ ర‌మ‌ణ (మ‌హేశ్‌బాబు) గుంటూరులో తన మేన‌త్త బుజ్జి (ఈశ్వ‌రిరావు) ద‌గ్గ‌ర పెరుగుతాడు.

వసుంధర తండ్రి వైరా వెంక‌టస్వామి (ప్ర‌కాశ్‌రాజ్‌) కూతురు ఎమ్మెల్యే అయినప్పటికీ అన్నీ తానై రాజ‌కీయ చ‌క్రం తిప్పుతుంటాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు(రవి శంకర్‌) కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని.. అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయటపెడతా అని సూర్య నారాయణ బెదిరిస్తాడు.

గుంటూరు కారంకు రివ్యూ ఇచ్చేసిన నెటిజన్లు, సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలు వెల్లడిస్తున్న నెటిజన్లు

ఈ నేపథ్యంలోనే ముందుచూపుగా వ‌సుంధ‌ర రాజ‌కీయ జీవితానికి ఆమె మొద‌టి పెళ్లి, మొద‌టి కొడుకు అడ్డంకిగా మార‌కూడ‌ద‌ని భావించిన వెంక‌ట‌స్వామి... ర‌మ‌ణ‌తో ఓ అగ్రిమెంట్‌పై సంత‌కం పెట్టించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడ‌తాడు. వ‌సుంధ‌ర‌కి పుట్టిన రెండో కొడుకుని ఆమె వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించడు.

తండ్రి రాయల్‌ సత్యం(జయరామ్‌) చెప్పినా వినకుండా.. గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్‌ని నడిపిస్తుంటాడు. అసలు వసుంధర మొదటి భర్త రాయల్‌ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా.. చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్‌ అమ్ము(శ్రీలీల)తో రమణ ఎలా లవ్‌లో పడ్డాడు? మరదలు మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎవరు ఎలా చేశారు: మహేశ్‌ బాబు యాక్షన్‌తో పాటు డ్యాన్స్‌ కూడా దుమ్మురేపాడు. అభిమానులకు మంచి కిక్కును అందించాడు. అమ్ము పాత్రలో హీరోయిన్ శ్రీలీల తన అందాలతో మెప్పించింది. చీరకట్టులో తెరపై తెలుగు అమ్మాయిలా మెరిసింది. వైరా వసుంధరగా రమ్యకృష్ణ తనదైన స్టైల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, జయరామ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. మీనాక్షి చౌదరి పాత్ర తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది.తమన్‌ సంగీతం, సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్‌ సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఇక కుర్చీ మ‌డ‌త‌పెట్టి పాటలో మహేష్ బాబు, శ్రీలీల డ్యాన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పుకోవాల్సిందే..

ఇక మాట‌ల‌తో మేజిక్ చేసే త్రివిక్ర‌మ్ ఈ సినిమాలో ఆ మ్యాజిక్ అందుకోలేకపోయాడనే చెప్పాలి. ‘అన్నం వ‌ద్ద‌నుకున్న‌వాడు రోజంతా ప‌స్తులుంటాడు, అమ్మ‌ని వ‌ద్ద‌నుకున్న‌వాడు జీవితాంతం ఏడుస్తాడు’. ‘అమ్మ త‌న బిడ్డ‌ల‌కి ఏం చేసింద‌ని అడ‌గ‌కూడ‌దు’, ‘త‌ద్దినం జ‌న్మ‌దినం రెండూ దినాలే’ వంటి డైలాగ్స్ అక్కడక్కడా పేల్చాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif