Manchu Vishnu: ఆ హీరో ఆఫీసు నుంచే ఇదంతా, 18 యూట్యూబ్‌ చానళ్లపై కేసు పెట్టిన మంచు విష్ణు, నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారని వెల్లడి

ఒక హీరో ఆఫీసు నుంచి నా మీద ట్రోల్స్‌ జరుగుతున్నాయి. నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు.

Vishnu-manchu (Photo-Wikimedia)

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా మూవీ ప్రమోషన్లో భాగంగా తనపై, తన కుటుంబంపై చేస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. ఒక హీరో ఆఫీసు నుంచి నా మీద ట్రోల్స్‌ జరుగుతున్నాయి. నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు.

ఈ వ్య‌వ‌హారంపై ఆఫీస్ చిరునామాతో పాటుగా వారు వినియోగించే ఐపీ అడ్రస్‌ల‌ను కూడా సేక‌రించాను. త్వ‌ర‌లోనే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు స‌మ‌గ్ర ఆధారాల‌తో ఫిర్యాదు చేస్తా. అలాగే నన్ను, నా కుటుంబాన్ని ట్రోల్‌ చేస్తున్న 18 యూట్యూబ్‌ చానళ్లపై కూడా కేసులు పెడుతున్నా. ఈ ట్రోల్స్‌ని సాధారణంగా మేం పట్టించుకోము. కానీ జవాబు దారితనం కోసం కేసులు పెడుతున్నా’ అని విష్ణు అన్నాడు.

మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు,చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక అన్ని రంగులు మారతాయి,దుమ్ము రేపిన గాడ్ ఫాదర్‌ ట్రైలర్‌

కాగా అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న జిన్నా సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 5న ట్రైలర్‌ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది.



సంబంధిత వార్తలు

Manchu Vishnu Meets Rachakonda CP: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ సుధీర్ బాబు, మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిక.. విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ అరెస్ట్

Manchu Family Dispute: మోహన్‌ బాబుపై కాంగ్రెస్ నేతల ఫైర్, జర్నలిస్టులపై దాడి సరికాదని మండిపాటు, మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ

Manchu Family Dispute: రాచకొండ సీపీ విచారణకు మోహన్ బాబు, మనోజ్, విష్ణు...జల్‌పల్లి ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ సుధీర్‌బాబు, మీడియాపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదు

Manchu Family Dispute: వీడియో ఇదిగో, మీడియా మీద చేయి చేసుకున్న మోహన్ బాబు, నా కూతురు లోపల ఉంది అంటూ గేట్లు నెట్టుకుని వెళ్లిన మంచు మనోజ్